Salman Khan: క్రేజీ ఆఫర్ కొట్టేసిన విక్రమ్ డైరెక్టర్? సల్మాన్ ఖాన్‌తో సినిమా?
విక్రమ్ సినిమా క్లాస్, మాస్ ప్రేక్షకులందరినీ అలరించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కమల్ హాసన్ కు చాలా ఏళ్ల తరువాత క్రేజ్ హిట్ తెచ్చిన సినిమా ‘విక్రమ్’. యాక్షన్ సన్నివేశాలు క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ అలరించాయి. ఆ సినిమాతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తమిళం,తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైంది. హిందీలో విక్రమ్ సినిమా సల్మాన్ ఖాన్ చూశారు. ఆ సినిమా ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. ఈ యంగ్ డైరెక్టర్‌కు సల్మాన్ ఖాన్ త్వరలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాను మైత్రి ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్టు టాక్ నడుస్తోంది.
హైదరాబాద్ వచ్చినప్పుడే...
ఆ మధ్యన సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే లోకేష్ - సల్మాన్ మధ్య భేటీని ఏర్పాటు చేశారట మైత్రి ప్రొడెక్షన్స్. సల్మాన్ ఖాన్ లోకేష్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బాలీవుడ్ కండల
వీరుడు టైగర్ 3లో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత లోకేష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇటు లోకేష్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. దళపతి విజయ్ తో ఆయన ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నారు. అలగే మళ్లీ కమల్ హాసన్ తో సినిమా చేయబోతున్నాడు. విక్రమ్ సీక్వెల్ కూడా రాబోతోందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. కాబట్టి వీరిద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాకే తమ కాంబో మూవీని మొదలుపెట్టగలరు. కాబట్టి ఆ సినిమా పట్టలెక్కడానికి కనీసం ఏడాదైనా పట్టేలా ఉంది.
లోకేష్ కనగరాజ్ గతంలో ఖైదీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో కార్తీ హీరోగా నటించారు. ఆ సినిమాతో అతనికి మంచి పేరే వచ్చింది కానీ స్టార్ డైరెక్టర్ హోదా రాలేదు. ఇప్పుడు విక్రమ్ సినిమాతా ఆ కోరిక తీరింది. యువ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు లోకేష్.
View this post on Instagram
Also read: ఆ కీర్తనతో వివాదంలో చిక్కుకున్న శ్రావణ భార్గవి, అవమానం జరిగిందంటున్న అన్నమయ్య వంశస్థులు
Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















