అన్వేషించండి

Khans of Bollywood: ఆదరణ లేక అవస్థలు పడుతున్న బాలీవుడ్ ఖాన్స్, మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేనా?

ఒకప్పుడు బాలీవుడ్ ను ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన ఖాన్స్ ఇప్పుడు హిట్స్ లేక చతికిలపడ్డారు. వరుస పరాజయాలతో రోజు రోజుకు ప్రేక్షకాదరణ కోల్పోతున్నారు. సల్మాన్ మినహా మిగతా ఖాన్స్ విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్ అనగానే ముగ్గురు ఖాన్స్ కళ్ల ముందు కదలాడేవారు. వారు నటించిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేవి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఈ ముగ్గురు బాలీవుడ్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించే వారు. కానీ, వారి ప్రభావం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. వారి నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. మంచి హిట్ లేక ఖాన్స్ అవస్థలు పడుతున్నారు. మళ్లీ సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ లోకి ఎక్కేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు.

‘జీరో’ తర్వాత అంతా జీరో

బర్త్ డే బాయ్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత పూర్తిగా తెరమరుగయ్యాడు. ఈ సినిమా హిట్ కాకపోగా, ఆ తర్వాత కొడుకు మాదకద్రవ్యాల వ్యవహారం పెద్ద తలనొప్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకు దూరం అయ్యాడు. షారుఖ్ 2013లో నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ అందుకోలేదు. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో  ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా  భారీ బడ్జెట్‌తో  తెరకెక్కిస్తున్నాడు.  వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు రెడీ అవుతున్నది. తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ కాంబోలో ‘జవాన్’ అనే సినిమా రూపొందుతున్నది.   ఈ మూవీ 02 జూన్ 2023లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో ‘డుంకి’ అనే మరో సినిమా తెరకెక్కుతున్నది. వీటితో మళ్లీ హిట్ బాటలోకి అడుగు పెట్టాలని  షారుఖ్ భావిస్తున్నాడు.

‘లాల్ సింగ్ చడ్డా’కు కోలుకోలేని దెబ్బ

ఇక అమీర్ ఖాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాయ్ కాట్ ఉద్యమం దెబ్బకు ఘోరంగా నష్టపోయాడు. అమీర్ ఖాన్ తాజాగా నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్దా’ సినిమా ఘోరాతి ఘోరమైన పరాభవం పాలైంది. అమీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాపై అమీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అవన్నీ అడియాశలయ్యాయి.  2000 సంవత్సరంలో వచ్చిన అమీర్ మూవీ ‘మేళా’  డిజాస్టర్ అయ్యింది. ఆ రికార్డును ‘లాల్ సింగ్ చడ్డా’ బ్రేక్ చేసింది. రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అందులో సగం డబ్బులు కూడా వసూలు చేయలేకపోయింది. 2016లో వచ్చిన ‘దంగల్‘ సినిమా  ఓరేంజిలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ స్థాయిలో కలెన్లు సాధించింది. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా‘ బాయ్ కాట్ దెబ్బకు డిజాస్టర్ అయ్యింది.

బాలీవుడ్ కండల వీరుడి పరిస్థితి అంతంత మాత్రమే!

ఇక సల్మాన్ ఖాన్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. 2015లో వచ్చిన ‘భజరంగీ భాయ్ జాన్’ తర్వాత పెద్దగా సినిమాలేవీ రాలేదు. 2021లో వచ్చిన ‘రాధే’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం  ‘కిసికా భాయ్ కిసికా జాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతుంది.  వచ్చే ఏడాది  ఈద్ కు టైగర్-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ సినిమాల మీదే సల్మాన్ ఆశలు పెట్టుకున్నాడు. మొత్తంగా ముగ్గురు ఖాన్స్ ఇప్పుడు విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ముగ్గురు హీరోలను బాయ్ కాట్ భయం వెంటాడుతోంది. 

Read Also: హిట్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్, 2023లోనైనా ఫామ్‌లోకి వచ్చేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Embed widget