Adipurush Twitter Review: ‘ఆదిపురుష్’ ఆడియన్స్ రివ్యూ - ప్రభాస్ రాముడిగా మెప్పించాడా? మూవీ చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన తాజాగా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రపంచ వ్యాప్తంగా 2D, 3Dలో విడుదలైంది. ఇంతకీ ఈ మైథలాజికల్ మూవీ ఎలా ఉంది? నెటిజన్లు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవుడిగా నటించగా, కృతిసనన్ జానకి పాత్రలో కనిపించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్( రూ.500 కోట్ల)తో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 2D, 3Dలో ఈ సినిమా విడుదలైంది. ఇంతకీ ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎలా ఉంది? ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎలా ఫీలవుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..
‘ఆదిపురుష్’ సినిమా ఇప్పటికీ ఓవర్సీస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా మంది ఈ సినిమాను ఇప్పటికే చూశారు. పలువురు ట్విట్టర్ వేదికగా సినిమా గురించి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమా గురించి కొంత మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుండగా, మరికొంత మంది విజువల్ ఎఫెక్ట్స్ అంతగా బాగాలేవు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో రాఘవ పాత్ర పోషించిన ప్రభాస్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అతడి పాత్రను తెరపై చూసి చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్తున్నారు. అతడి పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు. మిగతా పాత్రలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ చిత్రంలో ప్రభాస్ కాస్త తక్కువ స్ర్కీన్ స్పేస్ పొందినట్లు కనిపిస్తోందంటున్నారు. అయితే, రామాణయాన్ని ఇప్పటి యువతరానికి అర్థం అయ్యేలా చెప్పడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో విజయం సాధించలేదంటున్నారు.
#Adipurush Overall a retelling of the Ramayanam that had a promising 1st half but falls flat in the 2nd half and ends up being tiresome towards the end!
— Venky Reviews (@venkyreviews) June 15, 2023
The first half focused on the drama which worked, but the 2nd half didn’t have much other than a prolonged climax fight with…
మరోవైపు తొలి భాగం అద్భుతంగా ఉందని, సెకండాఫ్ మరీ బోర్ కొడుతుందని కామెంట్స్ పెడుతున్నారు. క్లైమాక్స్ ఫైట్ చాలా సేపు ఉండటంతో పాటు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోవడం లేదంటున్నారు. అంతేకాదు, పోరాట సన్నివేశాలు కార్టూన్ సీన్లు చూసినట్లుగానే ఉందంటున్నారు. గ్రాఫిక్స్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న సమయం ‘ఆదిపురుష్’ సినిమాను తీయడాన్ని అభినందిస్తున్నారు. సెకెండ్ ఆఫ్ కాస్త సాగదీసినట్లు ఉన్నా, రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయంటున్నారు. వీఎఫ్ఎక్స్ ఇంకా కాస్త బాగా చేసి ఉంటే బాగుంటుందంటున్నారు.
#Adipurush
— Film Buff 🍿🎬 (@SsmbWorshipper) June 15, 2023
Some movies shouldn’t be judged💯but just be appreciated.Adipurush is that film for this modern world💯🌟Apart from the dragged second half,movie has enough goosebumps moments for fans
Negatives:VFX is still half baked
Positives :Screenplay,Music
Rating :-4/5 🌟🌟🌟🌟 pic.twitter.com/qJ8L8xWeeP
భారతీయ సినీ పరిశ్రమలో ‘ఆదిపురుష్’ గుర్తుంచుకునే సినిమాగా ఉండబోతోందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ యాక్టింగ్ బాగుందంటున్నారు. బీజీఎం అత్యద్భుతం అంటున్నారు. హనుమాన్ పాత్ర చాలా బాగుందనే మాటలు వినిపిస్తున్నాయి.
జానకి పాత్రలో కృతిసనన్ ఒదిగిపోయి నటించింది అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే, ఆమెకు స్క్రీన్ టైమ్ తక్కువ ఉండటం మైనస్ గా మారిందంటున్నారు. సీతను రావణాసురుడు తీసుకెళ్లే సన్నివేశం, ఇంట్రవెల్ సీన్స్ సినిమాకు హైలెట్ అని చెప్తున్నారు. పాటలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. ఈ చిత్రం యాక్షన్ లవర్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పిస్తోందని ట్వీట్స్ చేస్తున్నారు.
#AdipurushReview : 4/5#Prabhas as Lord Shri Ram is Perfect on screen. Kriti Sanon ❤👌. #Hanuman unna every shot edho smile vachesthadhi, might coz he is Ram's biggest devotee. Vaali-Sugreev sequence, dialogues anni superb. Families & kids pakka love it. Watch #Adipurush in 3D. pic.twitter.com/wkCwSn6EbA
— Prabhas ❤ (@ivdsai) June 16, 2023
ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. థియేటర్లన్నీ ప్రభాస్ మేనియాతో దద్దరిల్లుతున్నాయి. తొలి రోజు రూ. 100 కోట్లు వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - అక్కడ ‘ఆదిపురుష్’ ఎర్లీ మార్నింగ్ షోకు అనుమతి!