అన్వేషించండి

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్ - అక్కడ ‘ఆదిపురుష్’ ఎర్లీ మార్నింగ్ షోకు అనుమతి!

‘ఆదిపురుష్’ సినిమాను జూన్ 16 న విడుదుల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే...

‘ఆదిపురుష్’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ దృశ్యకావ్యం సినిమాను జూన్ 16 న విడుదుల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి. తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. తెలంగాణలో ‘ఆదిపురుష్’ సినిమాను శుక్రవారం (జూన్ 16) తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక స్పెషల్ మార్నింగ్ షో ను ప్రదర్శించడానికి నైజాం డిస్ట్రీబ్యూటర్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అనుమతినిచ్చింది. ఈ మేరకు స్పెషల్ షో కు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ స్పెషల్ షో వేసుకోవడానికి థియేటర్ అద్దె, ఇతర సంబంధిత పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది. దీని కోసం సురేష్ వర్మ అనే వ్యక్తిని సంప్రదించాలని అతని ఫోన్ నంబర్ ను ప్రకటనలో పొందుపరిచింది. దీంతో నైజాం ప్రాంతంలో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీలో బెనిఫిట్ షోలకు నిరాకరణ..

ఏపీలో ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరపై రూ.50 పెంచుకోవచ్చన ఓ జీవోను విడుదల చేసింది. అయితే ఇది కేవలం పది రోజుల వరకే అనుమతి ఉంటుందని జీవోలో పేర్కొంది. అలాగే రోజుకు 5 షోలు మాత్రమే ప్రదర్శించాలని చెప్పింది. బెనిఫిట్/స్పెషల్ షోలకు సంబంధించి జీవోలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. అయితే అక్కడ సింగిల్ థియేటర్లలో రోజుకు ఐదు షో లు మాత్రమే ప్రదర్శితమవుతాయని తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. కాకపోతే రేపు ఒక్క రోజు మాత్రం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక స్పెషల్ షో కు అనుమతి ఉంది. దీని బట్టి తెలంగాణలో ఉదయం 6:30 గంటలకే షో పూర్తయి సినిమా టాక్ కూడా బయటకు వచ్చేస్తుందన్నమాట. 

మొదటిరోజు వంద కోట్ల వసూళ్లు?

‘ఆదిపురుష్’ పురుష్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మూవీ ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. సినిమా అనౌన్స్ నుంచి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకూ ఏదొక వివాదం జరుగుతూనే ఉంది. అయితే మొన్న రిలీజ్ చేసిన ఫైనల్ ట్రైలర్ తర్వాత ఈ సినిమా నెగిటివ్ టాక్ కాస్తా పాజిటివ్ టాక్ గా మారిపోయింది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అడ్వాన్స్ బుగింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా ‘ఆదిపురుష్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘ఆదిపురుష్’ సినిమాకు మొదటి రోజే రూ.100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. నిజంగా ఇలా జరిగితే ఇది పెద్ద రికార్డ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget