అన్వేషించండి

Film Stars Reunion: 80's నటీనటుల స్వీట్ రీయూనియన్ - ముంబైలో నాటి తారల ఆత్మీయ కలయిక, ఫొటోలు వైరల్

ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక సాంప్రదాయంగా వస్తుంది. తమ దశబ్దాల నాటి స్నేహాన్ని, ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ రీ యూనియన్ లో దక్షిణాది నుంచి తారలు తరలి వస్తారు.

1980వ దశకంలో సినీ ఇండస్ట్రీలో మెరిసిన తారలు మళ్ళీ కలిశారు. ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక ఎప్పట్నుంచో సాంప్రదాయంగా వస్తోంది. తమ దశబ్దాల నాటి స్నేహాన్ని, అలాగే ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ రీ యూనియన్ లో దక్షిణాది నుంచి తారలు తరలి వస్తారు. ఇటీవల బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్ మరియు పూనమ్ ధిల్లాన్ హోస్ట్ చేసిన ఈ 11వ రీ యూనియన్ ముంబై లో ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణాది నుంచి దాదాపు 25 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

మహారాష్ట్ర సాంప్రదాయంలో :
 
ఈసారి రీ యూనియన్ ను ముంబై లో ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర సంప్రాదాయాలను పాటించారు. మహారాష్ట్రలో స్థానిక రుచులతో వంటకాలను తయారు చేశారు. వేదిక వద్ద జరిగిన ఈ రీయూనియన్‌లో దక్షిణాది కు చెందిన అనేక మంది నటీనటులు కలిసి మాట్లాడుకున్నారు. ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూనమ్ ధిల్లాన్ రూపొందించిన కొన్ని సరదా గేమ్‌లు, క్విజ్‌ పోటీలలో కూడా నటీ నటులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది నుంచి చిరంజీవి, శరత్‌కుమార్, భాగ్యరాజ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ, మధుతో సహా హిందీ సినీ రంగానికి చెందిన నటీనటులు పాల్గొన్నారు. ఈసారి కొత్త థీమ్ దుస్తుల్లో తారలు మెరిశారు. నటీమణులు వెండి, నారింజ రంగుల్లో తళుక్కుమనగా, నటులు నారింజ, బూడిద రంగుల దుస్తుల్లో కనిపించారు. 

2009 నుంచీ ఈ సాంప్రదాయం:

ఎనభైల నాటి తారలంతా ప్రతీ ఏటా ఆత్మీయ కలయిక వేడుక జరుపుకోవాలనే కాన్సెప్ట్ ను సుహాసిని మణిరత్నం మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా 2009 నుంచి ఈ ఆత్మీయ కలయిక వేడుక నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ కలయిక చివరిసారిగా 2019 లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదికగా జరిగింది. ఆ వేడుక లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ కూడా హాజరయ్యారు. తర్వాత కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో 2020, 21 లలో ఈ ఆత్మీయ కలయికకు సందర్భం రాలేదు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో   11వ రీ యూనియన్ కు ఏర్పాట్లు చేశారు తారలు. 

ఈ సందర్భంగా తారలు ప్రస్తుతం సినిమాల పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వేడుక జరుపుకోవడానికి చాలా కారణాలున్నాయని పలువురు తారలు అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, బాక్సాఫీస్ వద్ద సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయని అన్నారు. ఇది సినిమా శక్తిని పునరుజ్జీవింపజేసి జరుపుకోవాల్సిన సమయం అని నటీనటులు అన్నారు. చాలా రోజుల తర్వాత జరిగిన ఈ కలయిక వేడుకలో తారలు ఎంతో ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, బాబుతో ఫోన్‌లో మాట్లాడిన విహారి! సహస్ర ఆ అబద్ధం చెప్పడానికి కారణమేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, బాబుతో ఫోన్‌లో మాట్లాడిన విహారి! సహస్ర ఆ అబద్ధం చెప్పడానికి కారణమేంటి?
Sandeep Reddy Vanga : సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Mummy OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే! 
100 ఏనుగుల బరువు, అయినా కింద పడవు! మేఘాల వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ మీకు తెలుసా? 
Embed widget