Indian 2 Box Office Collections: 'భారతీయుడు 2' షాకింగ్ కలెక్షన్స్ - దారుణంగా పడిపోయిన రెండో రోజు వసూళ్లు, ఎంతంటే..
'Indian 2' Day 2 Collection: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘భారతీయుడు 2’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. తొలి రోజు కలెక్షన్లు ఫర్వాలేదు అనిపించినా, రెండో రోజు భారీగా పడిపోయాయి.
Indian 2 Box Office Collection Day 2: లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘భారతీయుడు 2’. భారీ అంచనాల నడుమ జులై 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.56.25 కోట్ల షేర్, రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. భారత్ లో ఇప్పటి వరకు రూ. 42 కోట్లకు పైగా వసూళు చేసింది. రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, ఈ చిత్రం రూ. 18 కోట్లు సాధించింది. తమిళంలో రూ. 13.7 కోట్లు, తెలుగులో రూ. 3.2 కోట్లు, హిందీలో రూ. 1.3 కోట్లు మాత్రమే సాధించింది. ఓపెనింగ్ రోజున ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ. 25.6 కోట్ల నెట్ సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా తమిళంలో రూ. 30.2 కోట్లు, తెలుగులో రూ. 11.1 కోట్లు, హిందీలో 2.5 కోట్లు సాధించింది.
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
‘భారతీయుడు 2’ సినిమా రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ ఖరారు అయ్యింది. అంటే ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా, ఇంకా రూ. 120 కోట్లు వసూళు చేయాలి. అప్పుడే హిట్ అయినట్లు లెక్క. ఇక తెలుగులో ఈ సినిమాకు రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 25 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ సినిమా హిట్ అందుకోవాలంటే రూ. 25 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, హిట్ టాక్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదనిపిస్తోంది.
‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’
1996లో శంకర్, కమల్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ ‘భారతీయుడు 2‘ వచ్చింది. అప్పట్లో ‘భారతీయుడు’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. దేశ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ వీర శేఖర సేనాపతిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక ‘భారతీయుడు 2‘లో సముద్రఖని, బాబీ సింహా, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.
‘భారతీయుడు 3‘ ఉంటుందా?
‘భారతీయుడు 2‘ ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు శంకర్ ‘భారతీయుడు 3‘ ఉంటుందని ప్రకటించారు. అయితే, ‘భారతీయుడు2’కు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో తదుపరి పార్ట్ ఉంటుందా? లేదా?అనే డౌట్ ప్రేక్షకులలో తలెత్తుతోంది. త్వరలోనే ఈ అంశంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: ఓటీటీకి వచ్చేస్తోన్న కమల్ హాసన్ 'భారతీయుడు' - మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్, ఎక్కడంటే..!
Read Also: ఎక్కడికి వెళ్లినా మహేష్ బాబు టోపీతో ఎందుకు కనిపిస్తున్నాడు? జక్కన్న సినిమాకు ఏమైనా లింక్ ఉందా?