Kriti Sanon: నడుము సన్నగా ఉండాలట... నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా?
హీరోయిన్లు అందరూ ఏదో ఒక సమయంల్ప్ బాడీ షేమింగ్‌కు గురైన వారే. రీసెంట్‌గా కెరీర్ స్టార్టింగులో తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి కృతి సనన్ ఓపెన్ అయ్యారు.
హీరోయిన్లు అందరూ ఏదో ఒక సమయంలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొని ఉంటారని చెప్పవచ్చు. కాస్త బరువు పెరిగితే లావయ్యారని, తగ్గితే సన్నబడ్డారని, నవ్వు బాలేదని, నడక గురించి ఏదో ఒక అంశంలో హీరోయిన్లకు చాలా మంది సలహాలు ఇస్తుంటారు. కృతి సనన్‌కు కూడా కొంత మంది ఇచ్చారట. తెలుగులో మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే', నాగచైతన్యకు జోడిగా 'దోచేయ్' సినిమాల్లో నటించిన ఈవిడ, ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తున్నారు.
రీసెంట్‌గా కెరీర్ స్టార్టింగులో తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి, సలహాల గురించి కృతి సనన్ ఓపెన్ అయ్యారు. "నా నవ్వు జిగురులా ఉంటుందట. నేను నవ్వితే... ముక్కు ఓపెన్ అవుతుందట. అందుకని, నా పెదవులు కొంచెం లావు అయ్యేలా సర్జరీ చేయించుకోమని చెప్పినవాళ్లు ఉన్నారు. నేనేమైనా ప్లాస్టిక్ బొమ్మనా? నా నవ్వు అంతే! అది సాధారణమే. కొంత మంది అయితే నా నడుము సైజ్ తగ్గాలని కూడా చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లు వచ్చిన తర్వాత ఈ ప్రెజర్ ఎక్కువ అయ్యింది. దారినపోయే దానయ్యలు ఏదేదో చెబుతారు. ప్రతి ఒక్కరి మాటలు వినాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాల్సిన పని లేదు" అని కృతి సనన్ పేర్కొన్నారు.
కృతి సనన్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'లో నటించారు. ఆ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అది కాకుండా అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే', వరుణ్ ధావన్ 'భేడియా', టైగర్ ష్రాఫ్ 'గణపత్' సినిమాల్లో నటిస్తున్నారు.
View this post on Instagram
Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
Also Read: రామ్ క్యారెక్టర్, ఫస్ట్‌లుక్ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి