By: ABP Desam | Updated at : 04 Aug 2022 03:28 PM (IST)
ఎన్టీఆర్‌కి నాకు మధ్య లెక్కలుండవ్ - క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఈ సినిమా ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు తన బ్యానర్ ను కూడా ఇన్వాల్వ్ చేశారు కళ్యాణ్ రామ్. అందుకే వీలైనంత ఎక్కువగా సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ నడుస్తోంది. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానని.. సినిమా రిలీజ్ అయిన తరువాత బంద్ సంగతులు తెలుసుకుంటానని అన్నారు.
ఈ విషయం గురించి మాట్లాడానికి తనతో సినిమాలు చేస్తోన్న నిర్మాతలు వచ్చి కలుస్తామని అన్నారని.. కానీ ఇప్పుడు వద్దని చెప్పానని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఇక బాలయ్యతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా ఉంటుందని.. ఇప్పటికే ఆయనకు కథ వినిపించామని కానీ బాబాయ్ కి నచ్చలేదని.. నచ్చే కథ దొరికితే తప్పకుండా ఆయన సినిమా చేస్తారని అన్నారని కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తారక్ పార్ట్నరా..? అనే విషయం గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడారు. తనకి ఎన్టీఆర్ కి మధ్య లెక్కలు ఉండవని.. తామంతా ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో బిజినెస్ విషయాల గురించి మాట్లాడనని తెలిపారు. ఇక 'బింబిసార' సినిమా విషయానికొస్తే.. బింబిసారుడి కథతో ఈ సినిమాను తెరకెక్కించమని.. ఇందులో యుద్ధాలు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని అన్నారు కళ్యాణ్ రామ్. కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయని చెప్పారు.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!
Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్!
Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>