House of The Dragon Season 2: ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 షురూ - ఎందులో, ఎప్పుడు చూడవచ్చు? - తెలుగులో చూడటం ఎలా?
House of The Dragon Series: ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ఇక నుంచి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. వీటిని తెలుగులో ఎక్కడ చూడాలి?
House of The Dragon Season 2 in Telugu: ప్రపంచంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌ల్లో హెచ్‌బీవో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ముందు వరుసలో ఉంటుంది. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్ మొదటి సీజన్‌తోనే ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుంది. సోమవారం (జూన్ 17వ తేదీ) నుంచి ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సెకండ్ సీజన్ స్ట్రీమ్ అవుతుంది. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌ను ఈరోజు విడదుల చేశారు. టార్గేరియన్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వివాదాలు, అంతర్యుద్ధాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది.
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2లో ఏం ఉండనుంది?
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 1లో డేమన్ టార్గేరియన్, అలిసెంట్ హైటవర్, రెనేరా టార్గేరియన్, రెనేరిస్ టార్గేరియన్, ఒట్టో హైటవర్ వంటి పాత్రలను పరిచయం చేశారు. సీజన్ ముందుకు సాగేకొద్దీ ఈ పాత్రలు మరింత బలంగా మారతాయి. ఇక మొదటి సీజన్ చివరి ఎపిసోడ్‌లొ టార్గేరియన్ కుటుంబంలో అంతర్యుద్ధానికి దారి తీసే అంశాలను చూపించారు. దీంతో ఫ్యాన్స్ గత రెండేళ్ల నుంచి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.
రెండో సీజన్‌లో కూడా మొదటి ఎపిసోడ్ నుంచి ఎటువంటి టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఈ సీజన్ మరింత వయొలెంట్‌గా, రక్తపాతంలో ఉండనుందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్‌ను ఎక్కడ చూడవచ్చు?
మనదేశంలో ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్‌ను జియో సినిమాలో చూడవచ్చు. ఇంతకు ముందు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ ఉండేది. ఇప్పుడు అగ్రిమెంట్ ముగిసిపోవడంతో జియో సినిమా ఆ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే హెచ్‌బీవో కంటెంట్ చూడాలంటే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఒక నెలకు రూ.29, ఒక సంవత్సరానికి రూ.299 సబ్‌స్క్రిప్షన్ ధరగా నిర్ణయించారు.
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ తెలుగులో ఉందా?
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్‌ను ఫ్యాన్స్ తెలుగులో కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సిరీస్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. మీరు ఎపిసోడ్ మీద క్లిక్ చేయగానే కింద సెట్టింగ్స్‌లో చాలా ఈజీగా తెలుగులోకి మార్చుకోవచ్చు.
Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఎపిసోడ్లు ఎప్పుడు విడుదల అవుతాయి?
ఎపిసోడ్ 1: జూన్ 17వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 2: జూన్ 24వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 3: జులై 1వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 4: జులై 8వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 5: జులై 15వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 6: జులై 22వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 7: జులై 29వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
ఎపిసోడ్ 8: ఆగస్టు 6వ తేదీ, సోమవారం ఉదయం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)