HIT 2 : ‘హిట్ 2’ సెన్సార్ రిపోర్ట్ - వైలెన్స్‌తో వణికించనున్న అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరో గా నటిస్తోన్న సినిమా ‘హిట్ 2’. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బృందం ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. అలాగే రన్ టైమ్ ను రెండు గంటలుగా నిర్దేశించింది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న సినిమా ‘హిట్ 2’. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బృందం ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. అలాగే రన్ టైమ్ ను రెండు గంటలుగా నిర్దేశించింది. ఈ థ్రిల్లర్ మూవీలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శైలేష్ కొలను దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్, క్రైమ్ సినిమాలో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. హీరో నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హీరో అడివి శేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆయన కథలను ఎంచుకునే విధానం బాగుండటంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. అయితే సెన్సార్ తర్వాత సినిమా గురించి టాక్ మొదలైంది. మూవీలో ఫస్టాఫ్ మొత్తం అసలు కథలోకి వెళ్లకుండానే సాగుందని వినికిడి. అలాగే సెకండ్ ఆఫ్ మొత్తం కేవలం రెండు రాత్రుల్లోనే జరుగుతుందట. సినిమాలోని హంతకుడు ఎవరో చూసి సెన్సార్ బోర్డు సభ్యులు కూడా షాక్ అయ్యారట. దీంతో దర్శకుడు శైలేష్ కొలనును సెన్సార్ సభ్యులు అభినందించారని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అడివి శేష్ అదరగొట్టాడని తెలుస్తోంది. సెకండ్ ఆఫ్‌లో అతని నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్. అలాగే ‘హిట్’ సీరిస్‌లో వచ్చే మూడో కేస్ లో హీారో ఎవరు అనేది కూడా చివరి పది నిమిషాల్లో తెలిసిపోతుందని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా మొత్తం 7 సీక్వెల్స్ గా రూపొందిస్తున్నామని చెప్పారు శైలేష్. అంతేకాకుండా ఈ కేసుల్లో ఒక సీక్వెల్ లో హీరో మరో సీక్వెల్ లో హీరోను కలిసే అవకాశం కూడా ఉందని చెప్పారు. అయితే ఒక్కో సీక్వెల్ కూ హీరోలు మారతారని పెద్ద హీరోలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ కూల్ పోలీస్ ఆఫీసర్ గా ఉండే అడివి శేష్ కు ఒక ఛాలెంజింగ్ మర్డర్ కేసు ఎదురవుతుంది. ఆ మర్డర్ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? హంతుకుడు ఎవరు, హీరో హంతకుడ్ని పట్టుకున్నాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.
Read Also: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!