Virata Parvam: 'విరాట పర్వం' రీషూట్ చేస్తున్నారా? అసలు విషయం చెప్పిన హీరోయిన్!
'విరాట పర్వం' రీషూట్ చేస్తున్నారని, అందుకే విడుదల ఆలస్యమవుతోందని ఫిల్మ్ నగర్‌లో ఓ గుసగుస. దీనిపై హీరోయిన్ సాయి పల్లవి స్పందించారు.
'నీదీ నాదీ ఒకే కథ' విడుదల తర్వాత దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న సినిమా 'విరాట పర్వం'. ఇందులో రానా దగ్గుబాటి హీరో. ఆయనకు జోడీగా సాయి పల్లవి కనిపించనున్నారు. సినిమా చిత్రీకరణ అంతా పూర్తి అయ్యింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ ఉందని టాక్. అయితే... సినిమా రీషూట్ జరుగుతోందని, కొన్ని సన్నివేశాలు చిత్ర బృందానికి నచ్చకపోవడంతో మళ్లీ తెరకెక్కిస్తున్నారనే మాటలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. అయితే... ఆ అటువంటిది ఏమీ లేదని హీరోయిన్ సాయి పల్లవి చెప్పారు.
"విరాట పర్వం' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మళ్లీ షూటింగ్ ఏమీ చేయడం లేదు. నేను డబ్బింగ్ మాత్రమే చెప్పాలి" అని 'శ్యామ్ సింగ రాయ్' ప్రచార కార్యక్రమాల్లో సాయి పల్లవి తెలిపారు. దాంతో రీషూట్ వార్తలకు చెక్ పడింది. ఇందులో రానా దగ్గుబాటి ప్రేయసిగా ఆమె కనిపించనున్నారు. మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్న సంగతి తెలిసిందే.
Also Read: నీ సోది... నీకు చెప్పింది ఎవడు బ్రో? - ఇదీ రానా రెస్పాన్స్!
కరోనా కారణంగా 'విరాట పర్వం' విడుదల ఆలస్యం కావడంతో సినిమాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు వేణు ఊడుగులతో క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సినిమా నుంచి తప్పుకొన్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని హీరో రానాతో పాటు సురేష్ బొబ్బిలి కూడా ఖండించారు. ఇప్పుడు రీషూట్ వార్తలను సాయి పల్లవి ఖండించారు. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పడి పడి లేచె మనసు' తర్వాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణ భాగస్వామి. మాస్ మహారాజ్ రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను కూడా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: దీప్తీ సునైనా... మౌనమేల? ఆ మార్పు ఏంటో క్లారిటీగా చెప్పొచ్చుగా!
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి