Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌కు నెటిజన్ మ్యారేజ్ ప్రపోజల్, షాకింగ్ రిప్లై ఇచ్చిన బ్యూటీ!
నటి మృణాల్ ఠాకూర్ ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇటీవల ఓ నెటిజన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేశాడు. దీంతో ఈ కామెంట్ పై ఆమె స్పందించింది.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సీతారామం’. స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ నటి మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. సినిమాలో మృణాల్ అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ బ్యూటీకు యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అప్పటి వరకూ ఇతర భాషల్లో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ‘సీతారామం’ సినిమాతో వచ్చింది.
ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మృణాల్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ఓ సినిమాకు పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది మృణాల్. ఎప్పటికప్పుడు తన యాక్టివిటీలను ఫోటోలు, వీడియోలు రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇటీవల తాను షేర్ చేసిన ఓ వీడియోపై ఓ నెటిజన్ వింత ప్రశ్న వేశాడు. దానికి మృణాల్ కూడా తనదైన రీతిలో రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమెకు నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతాయి. అంతగా ఆమె తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే ఇటీవల ఆమె వైట్ కలర్ డ్రెస్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఓ స్పెషల్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే ఈ వీడియో చూసి ఓ అభిమాని ‘‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా సైడ్ నుంచి ఓకే’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ చూసి మృణాల్ కూడా తనదైన రీతిలో రిప్లై ఇచ్చింది. ‘నా సైడ్ నుంచి మాత్రం కాదు’’ అంటూ సమాధానమిచ్చింది. స్వయంగా మృణాల్ ఓ నెటిజన్ కామెంట్స్ పై సీరియస్ కాకుండా సరదాగా స్పందించడం చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మృణాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. హిందీ తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఆమె రీసెంట్ గా ‘సెల్ఫీ’ అనే హిందీ సినిమాలో నటించింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
View this post on Instagram