SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!
సీతారామం సినిమాలో ముందుగా విజయ్ ని హీరోగా అనుకున్నారట.
దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన 'సీతారామం' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. రష్మిక కీలకపాత్రలో కనిపించింది. తొలిరోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ అభిమానులు. దీంతో చిత్రబృందం జోష్ లో ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయం.
ఈ సినిమా చూసిన తరువాత సీతారాములుగా దుల్కర్, మృణాల్ లను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతగా వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్రను విజయ్ దేవరకొండ చేయాల్సిందట. ఈ విషయాన్ని దర్శకుడు హనురాఘవపూడి స్వయంగా వెల్లడించారు. 'సీతారామం' కథను విజయ్ దేవరకొండతో పాటు.. మరో స్టార్ హీరోకి కూడా చెప్పానని ఫైనల్ గా దుల్కర్ తో సెట్ అయిందని చెప్పారు హను రాఘవపూడి.
కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన ఈ సినిమా ఒప్పుకొని ఉండరు. విజయ్ మిస్ అయితే అయ్యాడు కానీ దుల్కర్ మాత్రం తన పాత్రలో జీవించేశారు. ఇదివరకు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన 'లై' సినిమా కోసం కూడా ముందుగా ఎన్టీఆర్ ని సంప్రదించారు. కా కాంబినేషన్ సెట్ కాకపోవడంతో నితిన్ తో పట్టాలెక్కించారు.
Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!
Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే
Sita Ramam First Weekend Collections In Telugu States : 'సీతా రామం' చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ బాగా హెల్ప్ అయ్యింది. తొలి రోజు కంటే రెండో రోజు, ఆ తర్వాత సెలవు రోజైన ఆదివారం మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ బరిలో సినిమా స్టడీగా ఉందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కోటిన్నర షేర్, శనివారం రూ. 2.08 కోట్ల షేర్, ఆదివారం రూ. 2.62 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా.
'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.54 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 85 లక్షలు
సీడెడ్ : రూ. 65 లక్షలు
నెల్లూరు : రూ. 23 లక్షలు
గుంటూరు : రూ. 47 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 50 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 56 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 40 లక్షలు
ఏపీ, తెలంగాణ... మొత్తం మీద మూడు రోజుల్లో 6.20 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. గ్రాస్ వసూళ్లు అయితే... 11.65 కోట్ల రూపాయలు. అమెరికాలో మూడు రోజుల్లో 2.80 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఈ సినిమా. కర్ణాకట ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపితే 60 లక్షలు, ఇతర భాషల్లో రూ. 1.55 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే... ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా 11.15 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వసూళ్లు చూస్తే... రూ. 22.20 కోట్లు ఉన్నాయి.