నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ చూసి - ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.?
ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద జరుగుతున్న హమాస్ దాడులు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘ఫౌదా’ వెబ్ సిరీస్ ఆధారంగా జరుగుతున్నాయా?
Hamas Attack: ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి హమాస్ తీవ్రవాదులు చేసిన దాడులు ఇప్పుడు గాజా అనే పట్టణాన్ని పూర్తిస్థాయిలో నేలమట్టం అయ్యేలా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకున్న హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం వెతికి వెతికి చంపుతోంది.
కానీ హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ లోకి వెళ్లి దాడులు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ ఈ దాడుల ఆలోచనలకు కారణమైందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడిదే వార్త ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఫౌదా అనే వెబ్ సిరీస్... ఇజ్రాయెల్-పాలస్తీనా దాడుల నేపథ్యంలో సాగుతోంది.
ఈ ఏడాది విడుదలైన సీజన్ లోని నాలుగో ఎపిసోడ్ హమాస్ ఇజ్రాయెల్ పైన మూడు వైపుల నుంచి దాడులకు పాల్పడతారు. అచ్చం అలానే హమాస్ నిజంగా ఇజ్రాయెల్ పై దాడి చేశారని వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ హన్నీ భక్షి వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు ‘ఫౌదా’ సిరీస్‌లోని నటులు కొందరు ఇజ్రాయెల్‌కు మద్దతుగా సైన్యంలో కూడా చేరుతున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial