Guppedantha Manasu October 29th Update: ఎక్కడో ఏదో మిస్సమవుతున్నాం అన్న రిషి, వసు మెసేజ్ చూసి కాంప్రమైజ్ అయిన జగతి
Guppedantha Manasu October 29th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 29th Today Episode 594)
వసుధార రిషి తో, దేవయాని గురించి మాట్లాడుతూ..నేను ఇక్కడ ఉండడం బాగా నచ్చిందంటం సర్. నేను మీకు తోడుగా ఉంటున్నాను అని నన్ను మెచ్చుకుంటున్నారు. వీలైతే ఇక్కడే ఉండమంటున్నారు వెళ్ళొద్దని చెబుతున్నారు అంటుంది. రిషి ముందు ఏమీ మాట్లాడలేక తల ఊపుతుంది దేవయాని. అప్పుడు రిషి దేవయానితో, మీరు వసుధారకు థాంక్స్ చెప్పడం ఎందుకు పెద్దమ్మ ఎంత కాదనుకున్న వసుధార మన కుటుంబ సభ్యురాలు కదా అంటాడు రిషి. అటు రిషి బయటకు వెళ్లి మహేంద్ర గురించి ఆలోచిస్తుంటాడు..ఆ వెనుకే వచ్చిన వసుధార.. నా కారణంగానే మహేంద్ర సార్ వెళ్లిపోయారా..నా కారణంగా ఓ కుటుంబం ముక్కలైందా..లేనిపోని సమస్యలు నేను తెచ్చిపెడుతున్నానా అని బాధపడుతుంది.
రిషి: అసలు ఏం జరిగి ఉంటుంది వసుధారా..డాడ్ ఇల్లు వదిలి, నన్ను వదిలి వెళ్లడం ఏంటి..ఎంత ఆలోచించినా అర్థంకావడం లేదు.. లోపం ఎక్కడుంది..మనం ఏదో ఎక్కడో మిస్సవుతున్నాం అనిపిస్తోంది. డాడ్ ఇంక నాకు ఎప్పటికీ కనిపించరా.. ఎప్పటికీ నా నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా..తనకి నేను గుర్తురావడం లేదా..నన్ను చూడాలని అనిపించడం లేదా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు...
వసు: మీకన్నా ఎక్కువగా అక్కడ వాళ్లు బాధపడుతుంటారు.
రిషి: మరి అంత బాధ ఉన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళడం ఎందుకు అయినా జగతి మేడంకి అన్నీ తెలుసుకదా. వెళ్లొద్దని డాడ్ కి చెప్పాలికదా
వసు: ఆవిడ చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం.. మీ అందరి దగ్గరా ఓ గొప్ప లక్షణం కామన్ గా ఉంది..మీరంతా మంచివారు సార్..మంచితనం, ప్రేమ, ఇంకాస్త మొండితనం అన్నీ కలగలపి ఉన్నాయి అందుకే ఇంత బాధను అనుభవిస్తున్నారేమో అనిపిస్తోంది. అప్పుడు వసు మనసులో... దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను మిమ్మల్ని కలుపుతాను అని అనుకుంటుంది. మహేంద్ర సార్ లేకపోవడంతో దేవయాని మేడం ఇంకా బాగా నటిస్తూ మీ బాధ మరింత పెంచుతోంది ఆ బాధని నేను తీరుస్తాను. ఎక్కడికి వెళుతున్నాం అని రిషి అడిగితే మీకు-నాకు బాగా పరిచయం ఉన్న చోటుకి అంటుంది. రిషి కారు పోనిస్తాడు
Also Read: వాల్తేరువాణి చాప్టర్ క్లోజ్, మోనితకు దుర్గ వార్నింగ్, శౌర్య దగ్గరకు కార్తీక్-దీప
జగతి-మహేంద్ర కూర్చుని మాట్లాడుకుంటారు. వసు సారీ అని మెసేజ్ పెట్టిందని జగతి అంటే..అందుకోసం మనం ఇక్కడికి రాలేదు కదా సారీ చెప్పగానే వెళ్లిపోడానికి అంటాడు మహేంద్ర. వాళ్ల మనసులు మారాలి కదా అంటే రిషి మారాడు కదా అని జగతి సమాధానం ఇస్తుంది. మనం వెళ్తే మళ్ళీ సమస్య తిరిగి మొదటికి వస్తుంది కనుక ఇంకొన్ని రోజులు ఓర్చుకోవాలి, రిషి-వసు దగ్గరవ్వాలనే కదా వచ్చేశాం...నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు...ఇంకొన్నాళ్లు తప్పదు అంటాడు మహేంద్ర.
హాల్లో కూర్చున్న దేవయాని..ధరణీ అనగానే.. కాఫీకావాలా అని అడుగుతుంది. కాఫీలు తాగడానికే పుట్టినట్టు మాట్లాడతావేంటి ఇటు రా కూర్చో సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటుంది.ధరణి షాక్ అయి చూస్తుంటుంది..
దేవయాని: కబుర్లు చెప్పడానికి కూర్చోమన్నాను..కత్తులతో పొడవడానికి కాదు కూర్చో ధరణి కూర్చో
ధరణి: మీరంటే గౌరవం నేను కూర్చోలేను...
ఓసారి నీ ఫోన్ తీసుకురా అనడంతో తెచ్చి ఇస్తుంది. జగతి అత్తయ్య వాళ్లు ఫోన్ చేశారని చూస్తున్నారా అంటుంది. చిన్నత్తయ్య వాళ్లు వెళ్లినప్పుడు చూసింది మీరే కదా అంటుంది ధరణి
దేవయాని: చూస్తే..వాళ్లు ఎక్కడికి వెళ్లారో అడ్రస్ తెలుసుకోవాలా అంటుంది
ధరణి: వసుధార మాటలు గుర్తుచేసుకున్న ధరణి.. మనం అన్నీ జరగాలి అనుకుంటాం జరగవు కదా..నాకు కిచెన్లో పనుంది ఫోన్ వస్తే పిలవండి అనేసి... అందులో పాము-ముంగిస గేమ్ ఉంది ఆడుకోండి భలే బావుంటుంది అంటుంది
Also Read: రిషి కన్నీళ్లు చూసి కరిగిపోయిన వసు, ఈగో మాస్టర్ ముందు దేవయానిని బుక్ చేసిన వసుధార
రిషి ఫొటో చూస్తూ మహేంద్ర బాధపడుతుంటాడు.. భోజనం చేయి మహేంద్ర అని జగతి అంటే రిషిని చూస్తుంటే చాలు నాకేం వద్దంటాడు. ఇప్పుడు రిషి కూడా నీ గురించి ఆలోచిస్తూ భోజనం మానేయాలి అని నువ్వు కోరుకోవు కదా రా మహీంద్ర అని తినిపిస్తూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర రిషి తనికి తినిపిస్తున్నట్టు అనుకుంటూ ఎంతో బాధపడతాడు.
ఎపిసోడ్ ముగిసింది