అన్వేషించండి

Movie Ticket Price Drop: జీఎస్టీ కొత్త స్లాబులతో తగ్గనున్న టికెట్ ధరలు, నిర్మాతలకు మేలు : ఏపీ మంత్రి కందుల దుర్గేష్

Kandula Durgesh | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన జీఎస్టీ కొత్త స్లాబులతో సినిమా టికెట్ ధరలు తగ్గుతాయని, నిర్మాతలకు మేలు చేకూరుతుందని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

New GST Slabs in India | అమరావతి: దేశంలో పన్ను వ్యవస్థను సులభం చేయడం కోసం జీఎస్టీ  కౌన్సిల్  తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న 4 స్లాబుల (5 శాతం, 12%, 18%, 28%) స్థానంలో ఇకపై కేవలం 2 స్లాబులు 5శాతం, 18 శాతం మాత్రమే అమలులోకి వస్తాయని.. దాంతో  ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాక్స్ తగ్గితే ఉపాధి పెరుగుతుంది..

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా  సేవా ఆధారిత రంగాలైన పర్యాటక, సినిమాటోగ్రఫీ రంగాల (Film Industry)పై ప్రభావం పడనుందన్నారు. వీటికి టాక్స్ తగ్గితే ఉపాధి పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రత్యేకించి హోటల్ రూమ్ టారిఫ్‌లు రూ.7,500 లోపు ఉన్న వాటిపై పన్ను 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు ఉంటుందన్నారు. ఎకానమీ క్లాస్ విమాన టికెట్లపై GST 12 శాతం నుండి 5% కు తగ్గింపు ఉంటుందని, రెస్టారెంట్ బిల్లులపై పన్ను కూడా 12– 18 శాతం నుండి 5%కి తగ్గుతుందన్నారు. అంతేగాక బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందని కందుల దర్గేష్ అభిప్రాయపడ్డారు. 

దిగిరానున్న సినిమా టికెట్ ధరలు

సినిమా రంగం (Tollywood) విషయానికి వస్తే సినిమా టికెట్లు రూ.100 లోపు ఉంటే 12% GST,  రూ.100 పైగా ఉంటే 18% GST కొనసాగుతుందన్నారు.. పాత 28% రేటు పూర్తిగా రద్దవుతుందన్నారు. సినిమా ప్రొడక్షన్ సేవలు (editing, dubbing, VFX) అన్నీ 18% శ్లాబ్ పరిధిలోకి లోకి వస్తాయని,  ఇది నిర్మాతలకు ఆర్ధికంగా మేలు చేస్తుందన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజలకు చవకైన ప్రయాణం, తక్కువ ధరల్లో వినోదాన్ని పంచుతుందన్నారు. అంతేకాకుండా, పర్యాటక రంగం, సినిమా రంగం బలోపేతం కావడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే సంస్కరణలు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్పులు “సులభ పన్ను – బలమైన ఆర్థిక వ్యవస్థ” లక్ష్యాన్ని చేరుకునే దిశగా పెద్ద అడుగుగా నిలుస్తాయని జనసేన నేత, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget