అన్వేషించండి

Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లు రెడీ.. ఏది కావాలో ఓటు ద్వారా డిసైడ్ చేసేయండి

Andhra Pradesh News | అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు వరకు 5 కి.మీ పొడవుతో ఈ ఐకానిక్ కేబుల్‌ బ్రిడ్జిని ఏపీ ప్రభుత్వం నిర్మించనుంది. అయితే డిజైన్ డిసైడ్ చేసే ఛాన్స్ ప్రజలకు ఇచ్చారు.

Amaravati Iconic Bridge | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ వంతెన (Iconic Cable Bridge) నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమరావతికి ప్రత్యేక గుర్తింపు కలిగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసి, వాటిలో ఒకదానిని ఎంపిక చేసేందుకు ప్రజల ఓటింగ్‌కు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 

ఈ కేబుల్ బ్రిడ్జి డిజైన్లు ఆధునిక ఇంజినీరింగ్ శైలితో పాటు కూచిపూడి కళను మిళితం చేసింది. ఎంపిక చేసిన నాలుగు నమూనాల్లో 3 కూచిపూడి నృత్య శైలిని ప్రతిబింబిస్తే, ఒక డిజైన్ అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ‘A’ ఆకారంలో ఉంది. ఇవన్నీ అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికే రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి డిజైన్‌ను డిసైడ్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం ఏపీ ప్రజలకే కల్పించింది.

ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్‌పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే, CRDA వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వెబ్‌సైట్ హోంపేజీలో Vote for Amaravati Iconic Bridge Design అని స్క్రోల్ అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి, అందుబాటులో ఉన్న 4 డిజైన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అనంతరం క్యాప్చా కోడ్ ఇచ్చి ఓటు నమోదు చేయవచ్చు. ఐకానిక్ బ్రిడ్జి డిజైన్‌కు ఇక్కడ ఓటేయండి https://crda.ap.gov.in/apcrdav2/userInterface/Bridge_poll_Tel.aspx

ఈ ఐకానిక్ వంతెన (Iconic Cable Bridge) రాయపూడి (అమరావతి) నుంచి కృష్ణా నదిని దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు నిర్మించనున్నారు. వంతెన పొడవు సుమారు 5 కిలోమీటర్లుగా ఉండబోతుంది. ఈ నిర్మాణం పూర్తయితే రాయపూడి నుంచి మూలపాడు వరకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.

అమ‌రావ‌తి - హైద‌రాబాద్ హైవేను క‌నెక్ట్ చేసే ఐకానిక్ బ్రిడ్జ్  


Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లు రెడీ.. ఏది కావాలో ఓటు ద్వారా డిసైడ్ చేసేయండి
కేబుల్ బ్రిడ్జి ఆప్షన్  1  కూచిపూడి నృత్యంలో, హ‌స్త ముద్ర‌లా ఉండే, రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జి. ఇంజ‌నీరింగ్ ను, క‌ళ‌ను క‌ల‌గ‌లిపి నిర్మించే బ‌ల‌మైన ఐకానిక్ వంతెన (కూచిపూడి హ‌స్త ముద్ర‌ను ఎంపిక చేయండి)


Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లు రెడీ.. ఏది కావాలో ఓటు ద్వారా డిసైడ్ చేసేయండి
ఆప్షన్ 2   ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లుతో మ‌న సంస్కృతికి, అదృష్ణానికి చిహ్నంగా. స్వస్తిక హ‌స్త భంగిమ‌లో ఉండే, కూచిపూడి డాన్స్ బ్రిడ్జి (కూచిపూడి స్వస్తిక హ‌స్త భంగిమ‌ను ఎంపిక చేయండి)


Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లు రెడీ.. ఏది కావాలో ఓటు ద్వారా డిసైడ్ చేసేయండి
ఆప్షన్ 3    అమ‌రావ‌తి లోగో A ఆకారంలో, అభ‌య ముద్ర‌లో శాంతికి చిహ్నంగా ఉండే ఐకానిక్ వంతెన‌ (అమ‌రావ‌తి లోగో A ఆకారంలో, అభ‌య ముద్ర‌ను ఎంపిక చేయండి)


Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లు రెడీ.. ఏది కావాలో ఓటు ద్వారా డిసైడ్ చేసేయండి
ఆప్షన్ 4   కూచిపూడి నృత్యంలోని క‌పోత ముద్ర‌లో, చేతులు ఎత్తి అభివాదం చేస్తున్న‌ట్లుండే ఐకానిక్ వంతెన‌ (కూచిపూడి క‌పోత ముద్ర‌ను ఎంపిక చేయండి)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget