News
News
X

Gruhalakshmi September 7th: అభిని అంకితకి విడాకులు ఇవ్వమన్న గాయత్రి- తులసి ఇంటికి సామ్రాట్, లాస్య స్కెచ్ మామూలుగా లేదుగా

తులసి, సామ్రాట్ ని శాశ్వతంగా దూరం చేసేందుకు లాస్య ప్లాన్స్ వేస్తుంది. ఇవరజు ఎపిసోడ్లో ఎం జరిగిందంటే..

FOLLOW US: 

అభి తన అత్త గాయత్రి దగ్గరకి వస్తాడు. అంకిత రాలేదా అని అడుగుతుంది. మా ఇంట్లో ఉంది అత్తగారింట్లో మా అమ్మ చుట్టూ భజన చేస్తూ ఉంది తన మీద మీరు ఆశలు వదులుకొమ్మని అభి అంటాడు. నువ్వు ఈ ఇంటికి రావడం అంటూ జరిగితే అది అంకితతోనే అని చెప్పాను కదా మరి ఒక్కడివే ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. ఇది టూ మచ్ ఆంటీ అంకిత లేకపోతే నేను ఈ ఇంటి అల్లుడిని నాకు ఆ విలువ లేదా అని అభి కోపంగా అంటాడు. మొగుడు లేకపోయినా అత్తరింట్లో నా కూతురుకి విలువ ఇస్తున్నారేమో కానీ పక్కన నా కూతురు లేకుండా నువ్వు ఒక్కడివే ఉంటే ప్రయోజనం లేదని గాయత్రి అంటుంది. అంకితకి మా మామ్ రోల్ మోడల్ గా మారిందని అంటాడు. తను మారదు అని అభి అనేసరికి అయితే నా కూతురుకి విడాకులు ఇచ్చేయ్ అప్పుడు చచ్చినట్టు నా కూతురు నాదగ్గరకి వచ్చేస్తుందని గాయత్రి అంటుంది. మీ అమ్మ తప్పులు చెయ్యని మనిషేమి కాదు కదా ఓపికగా ఎదురు చూసి అత్తగారి నిజ స్వరూపం ఏంటో చూపించు అప్పుడు తానే నిజం తెలుసుకుని నీ దారిలోకి వస్తుంది వెళ్ళు వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్తుంది.

నందు, లాస్య వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఫుల్ ఖుషీగా ఉంటారు. తులసి, సామ్రాట్ గురించి పేపర్లో వేయిస్తుంది లాస్య. అది చూసి నందు షాక్ అవుతాడు. నిజంగా తులసి ఈ వార్త ఇచ్చిందా అని నందు అడుగుతాడు. తను ఎందుకు వేస్తుంది నేనే వేయించాను అని చెప్తుంది. ఈ పేపర్ వార్త చూసి సామ్రాట్ కోపంతో ఊగిపోతాడు. సామ్రాట్ తో ఒక్కసారి మాట్లాడమని అనసూయ, పరంధామయ్య తులసితో చెప్పి చూస్తారు. కానీ అందుకు తులసి మాత్రం ఒప్పుకోదు. తులసి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళేసరికి మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ కి వస్తారు. నా ఇంటర్వ్యూ ఎందుకని తులసి అనుమానంగా అడుగుతుంది.

Also Read: దేవి మీద ప్రేమ పెంచుకుంటున్న చిన్మయి- అయోమయంలో రుక్మిణి, ఆదిత్యపై సత్య అనుమానం

సామ్రాట్ గారు ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. మీరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట ఇది ఎంతవరకు నిజం? అదే నిజం అయితే కారణం ఏంటని మీడియా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. తులసి మాత్రం ఇది ఎలా బయటకి వచ్చిందని ఆలోచిస్తుంది. అదే విషయం వాళ్ళని అడుగుతుంది. అది సామ్రాట్ గారి ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదని తులసి అంటుంది. అదేంటి సామ్రాట్ గారితో మీకు చెడిందా అని మీడియాలో ఒకరు అడుగుతారు. ఆ మాటకి అభి కొప్పడతాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలన్న సామ్రాట్ గారే చెప్పాలి నేను కాదు పెట్టుబడి పేరు ఆయనది, ఆలోచన మాత్రమే నాది అని తులసి అంటుంది.

పేపర్ లో కదులుతున్న సామ్రాట్ సామ్రాజ్యం అని తులసి ప్రాజెక్ట్ గురించి రాసిన వార్త సామ్రాట్ చూస్తాడు. అప్పుడే నందు, లాస్య అప్పుడే ఏమి తెలియని వాళ్ళలాగా అక్కడికి వస్తారు. ఇష్టం లేదు వదిలేసింది మళ్ళీ ఇదంతా ఏంటి అని సామ్రాట్ అరుస్తాడు. నాకు అదే అర్థం కావడం లేదు సర్ మీ మధే ఏదైనా చెడిందా అని లాస్య పుల్ల వేసేందుకు ట్రై చేస్తుంది. ఆ మాటకి సామ్రాట్ ఏంటి నువ్వు మాట్లాడేది అని అరుస్తాడు. తులసికి అతి చనువు ఇచ్చారు అందుకే ఇప్పుడు తాను ఆడుకుంటుంది. ప్రెస్ వాళ్ళని తులసి ఇంటికి పిలిపించిందని తెలిసింది అర్జంట్ గా మీరు వెళ్ళి ఆపండి అని లాస్య మరింత ఎక్కిస్తుంది.

Also Read: పేపర్ కి ఎక్కిన తులసి, సామ్రాట్ గొడవ, లాస్య ప్లాన్ సక్సెస్ - తులసిని ఆఫీసులో అడుగుపెట్టనివ్వనన్న సామ్రాట్

మా అమ్మని విసిగించకండి వెళ్లిపోండి అని ప్రేమ్ చెప్పేసరికి వాళ్ళు వెళ్లిపోతారు. తులసి బాధగా ఇంట్లోకి వస్తుంది. అసలు ఈ విషయం బయటకి ఎలా వెళ్ళిందని తులసి అంటుంది. నిన్ను బ్లెమ చేయించడానికి సామ్రాట్ గారే ఈ పని చేయిస్తున్నారని అభి అంటాడు. అప్పుడే సామ్రాట్ తులసి ఇంటికి వచ్చేసరికి మీడియా వెళ్ళు వెళ్తూ ఉంటారు. లాస్య చెప్పింది నిజం తులసి నా పరువు తియ్యడానికి ట్రై చేస్తుందని అనుకుంటాడు. సామ్రాట్ గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేదని తులసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది.

సామ్రాట్ కోపంగా ఇంట్లో వచ్చి అందరిని తిడతాడు. 'కుటుంబం అంతా కలిసి నా మీద యుద్ధం ప్రకటించారన మాట. ఒక మనిషిని అతిగా నమ్మడం తప్పు నాది. ఆ మనిషి స్థాయి పెంచాలని అనుకోవడం నా తప్పు. మా అమ్మని ఎదగనివ్వడంలో అలిసిపోయిన ఆగిపోనివ్వద్దు అని ప్రేమ్ నాదగ్గర మాట తీసుకున్నావ్ కానీ ఇప్పుడు అలిసిపోయి కాదు ఇగోతో ఆగిపోయింది’ అని కోపంగా అంటాడు.

తరువాయి భాగంలో..

నాకు తులసి ఆంటీ వాళ్ళ లాగా వినాయకుడు పూజ చేసుకోవాలని ఉంది అందుకే రేపు మీ ఇంటికి రావొచ్చా అని తులసి ఆంటీని అడిగాను అని హని చెప్పేసరికి సామ్రాట్ షాక్ అవుతాడు. నీ మోహమాటానికి నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందేమో అని భయంగా ఉందని దివ్య తులసితో అంటుంది. హనిని పంపడం పంపించకపోవడం సామ్రాట్ గారి ఇష్టం అని తులసి అంటుంది. ఇటేమో మా నాన్న వెళ్లొద్దు అనడు నన్ను దగ్గర ఉండి తీసుకెళ్తాడు అని హని అంటుంది.      

 

Published at : 07 Sep 2022 09:44 AM (IST) Tags: Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial Gruhalakshmi Serial September 7th

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!