(Source: ECI/ABP News/ABP Majha)
Gruhalakshmi September 13th Update: సామ్రాట్ ముందే నందుని అవమానించిన అనసూయ- పండగ సంబరాల్లో గొడవపడిన ప్రేమ్, శ్రుతి
అనుకోకుండా లాస్య తులసి, నందుల గురించి నిజం కక్కేస్తుంది. ఆ మాటలు విని సామ్రాట్ తులసిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఫీల్ అవుతాడు.
సామ్రాట్ గారితో అపార్థాలు పోగొట్టుకోవడం గురించి అంకిత, ప్రేమ్, శ్రుతి తులసితో మాట్లాడటానికి వస్తారు. దాని గురించి తర్వాత మాట్లాడదామని తులసి వెళ్లబోతుంటే మా బాధ అర్థం చేసుకో అని ప్రేమ్ అంటాడు. మీ ఇద్దరు అలా అంటి ముట్టనట్టు ఉంటే మాకు చాలా బాధగా ఉంది ఎ సమస్య లేని చోట సమస్య క్రియేట్ చేసుకుంటున్నావ్ అని ప్రేమ్ అంటూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన సామ్రాట్ ఆ మాటలు వింటాడు. మరో వైపు నందు, లాస్య కూడా వింటారు. సామ్రాట్ గారు మంచి మూడ్ లో కనిపిస్తున్నారు మనసు విప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అంకిత అంటుంది. ఆయన ఇచ్చిన గౌరవాన్ని మర్యాదని, చనువుని స్వార్థానికి వాడుకున్నట్టు అవుతుందని తులసి చెప్తుంది. పెద్ద మనసుతో నా మాట మన్నించి లోపలికి వచ్చారు అంతే తప్ప మా మధ్య గొడవ గురించి ప్రస్తావించలేదు రచ్చ చెయ్యలేదు, సామ్రాట్ గారు పెద్ద మనిషి తరహాలో ఉన్నప్పుడు మనం అలాగే ఉండాలని అంటుంది.
‘ఈరోజు మనం అంతా కలిశామన్న, ప్రశాంతంగా ఉన్నామన్నా కారణం ఆయనే. ఇప్పుడు నేను నిజం చెప్తే దాని ప్రభావం మీ నాన్న మీద పడుతుంది గొడవ జరుగుతుంది. ఈరోజు సామ్రాట్ గారిలాగా మీ నాన్న కూడా అతిథి. ఆయన గౌరవం కాపాడటం నా బాధ్యత. ఈ విషయం ఇక్కడితో వదిలేయ’మని తులసి చెప్తుంది. అందరూ కలిసి సంతోషంగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. తులసి లక్కీ, హనీకి అన్నం తినిపిస్తుంది. పప్పన్నం సూపర్ గా ఉందని లక్కీ అంటాడు. ఈ పప్పన్నం నచ్చక మీ అంకుల్ తులసి ఆంటీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చద్దన్నం కోసం గిలా గిలా కొట్టుకుంటున్నాడు. ఆ లొట్టలు ఏవో మీ అంకుల్ ముందు వెయ్యి అని అనసూయ నందు పరువు తీసేస్తుంది. అది చూసి నందు అసహనంగా ఫీల్ అవుతుంది.
ఈ కుటుంబాన్ని హనీ ఎందుకు ఇష్టపడుతుందో ఈరోజు నాకు అర్థం అయింది తులసి గారు నాకు చాలా ఈర్ష్యగా ఉంది తులసి గారు. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళ ముందు చాలా రూడ్ గా మాట్లాడి తప్పు చేశాను అని సామ్రాట్ అంటాడు. మీరు కోపానికి కారణం ఉంది అందులో నిజాయితీ ఉందని తులసి అనేసరికి అంటే నిజాయితీ లేనిదే నీకేనా మామ్ అని అభి అంటాడు. ఆయన సోరి చెప్పి సర్ది చెప్తుంటే నువ్వు అది కూడా వద్దని అంటున్నావ్ నటన కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడుకోమని అంటాడు. అభి ఏం మాట్లాడుతున్నావ్ అని అంకిత తనని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక పండగ సంబరాలు మొదలు అవుతాయి.
Also Read: జ్ఞానంబ మీద ఒట్టేసి మరి అబద్ధం చెప్పిన అఖిల్- జెస్సిని తప్పుగా చూపించి జానకికి షాకిచ్చిన అఖిల్
దివ్య చిటీల ఆట మొదలు పెట్టేస్తుంది. భార్య ఎలా ఉండాలో చెప్పాలి అని అంకితకి వచ్చిన చిటిలో వస్తుంది. అభి అంకిత మీద ఉన్న ప్రేమ గురించి చాలా ఎమోషనల్ గా చెప్తాడు. భార్య మనసులో నా స్థానం ఏమిటో నేనే వెతుక్కోవాల్సి వస్తుంది దానికి కారణం ఎవరో పేరు చెప్పాలని అనుకోవడం లేదని అంటాడు. అంకితకి ఐ లవ్యూ చెప్తాడు కానీ తను మాత్రం మౌనంగా ఉంటుంది. నీ మనసులో బాధ చాలా ధైర్యంగా చెప్పావ్ అభి నీ కష్టం త్వరలోనే తీరిపోవాలని కోరుకుంటున్నా అని నందు అంటాడు. ఇక ఆటలో తర్వాత ప్రేమ్, శ్రుతి వంతు వస్తుంది. ప్రేమలో ఉన్న జంట గొడవ పడితే ఎలా ఉంటుందో యాక్ట్ చేసి చూపించాలని ప్రేమ్ వాళ్ళకి చిటిలో వస్తుంది. ఇది అద్దం పెట్టుకుని ఇద్దరు తమ మనసులో ఉన్న కోపాన్ని చూపించుకుంటారు.