అన్వేషించండి

Gruhalakshmi June 26th: తన కూతురి జోలికి వస్తే చంపేస్తానని లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- భర్త ముందు మరోసారి దోషిగా దివ్య?

నందు, లాస్యకి విడాకులు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మొగుడ్ని దివ్య బాగానే బుట్టలో వేసుకుంటుంది. పెళ్ళాం అందం చూసి విక్రమ్ మనసు కరిగిపోతుంది. లాస్యతో విడాకులు వచ్చాయని దివ్య సంతోషంగా చెప్తుంది. ఇద్దరూ ఒక కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగేస్తారు. రాజ్యలక్ష్మి హాస్పిటల్ మేనేజర్ ని తిడుతుంది. మోసం చేశావు మా హాస్పిటల్ లో పని చేస్తూ శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా అని కొప్పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే వద్దులో ఉద్యోగంలో నుంచి తీసేయమని విక్రమ్ అంటాడు. అది కష్టమని ఇప్పటికిప్పుడు ఎక్స్ పీరియన్స్ వ్యక్తి దొరకరని సంజయ్ అంటాడు. మోసం చేసిన వ్యక్తి ఉండటానికి వీల్లేదని విక్రమ్ ఖరాఖండీగా చెప్తాడు. లాస్య ఉంది కదా తనకి ఎక్స్ పిరియన్స్ ఉందని తను ఖాళీగా కూడా ఉందని రాజ్యలక్ష్మి రికమండ్ చేస్తుంది. పైగా మీ ఇద్దరి పెళ్లి కూడా చేసింది కదా రుణం తీర్చుకోవాలని అంటాడు. ఆవిడ వల్ల ఇక్కడ కూడా లేనిపోని సమస్యలు రావచ్చు. లాస్య మీద నమ్మకం లేదు. ఆమెని అపాయింట్ చేయడం దివ్యకి కూడా ఇష్టం లేదని విక్రమ్ చెప్తాడు.

Also Read: కీలక మలుపు, కృష్ణని మురారీ జీవితంలో నుంచి వెళ్లిపొమ్మన్న ముకుంద

లాస్య కాకుండా వేరే ఎవరినైనా చూడమని చెప్తాడు. నా కొడుకు నా మాట కాదనడు అని రోజూ చెప్తారు కదా ఇప్పుడు ఏమంటారు. మీ మాట కాదనడం కాదు దివ్యకి ఇష్టం లేదు కాబట్టి వద్దు అన్నాడు. ఎంత అవమానం జరిగిపోయింది. లాస్యని ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం ఉన్న మేనేజర్ ని పీకేశారు. మీరు అనుకున్నట్టు జరగదు. కోర్టులో మానాన్న గెలిచాడు. ఇక్కడ నేను గెలిచాను నాకు మంచి రోజులు మొదలయ్యాయి. ఇక నుంచి మీ అబ్బాయి నా చంకలో ఉన్నట్టేనని దివ్య రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. లాస్యని అపాయింట్ చేసే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. తులసి దివ్యకి ఫోన్ చేసి లాస్య మా అత్తతో కలిసి కొత్త ప్లాన్ వేసిందని చెప్తుంది. అక్కడ ఆశ్రయం కోల్పోయిన లాస్య మా అత్త సపోర్ట్ తో ఇక్కడ చేరాలని చూస్తుందని అంటుంది. అదే జరిగితే నీ జీవితం రిస్క్ లో పడుతుందని తులసి జాగ్రత్త చెప్తుంది. విక్రమ్ వద్దని చెప్పాడని అంటుంది.

Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు

ఈ విషయం మీ అత్తకి అసలు మింగుడు పడదు. ఏదో ఒక విధంగా సాధిస్తుందని తులసి హెచ్చరిస్తుంది. తులసి విషయం చెప్పేసరికి నందు ఆగ్రహంతో ఊగిపోతాడు. లాస్య జరిగింది తలుచుకుని రగిలిపోతుంది. అప్పుడే నందు ఆవేశంగా తన దగ్గరకి వస్తాడు. కూర్చో కలిసి డ్రింక్ చేసి చాలా కాలం అయిపోయిందని అంటుంది. మాజీ పెళ్ళాం ట్రాప్ లో పడి నన్ను మోసం చేశావని అంటుంది. నందు ఆవేశంగా లాస్య గొంతు పట్టుకుని నా కూతురి జోలికి వెళ్లొద్దని చెప్తే మళ్ళీ అదే తప్పు చేస్తున్నావ్. నిన్ను పైకి పంపాలని డిసైడ్ అయ్యి వచ్చానని తోసేస్తాడు. నాకూతురి జోలికి వెళ్లకు.. ఇంకోసారి ఇదే తప్పు జరిగితే నిన్ను నిజంగానే చంపి జైలుకి వెళ్తాను. నాకు నా కూతురి జీవితం ముఖ్యమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఒక లెక్క లాస్య నిన్ను నిద్రపోనివ్వదు అనుకుని ఎవరికో ఫోన్ చేసి నందు ఇంటికి వెంటనే వెళ్ళమని చెప్తుంది. దివ్య తన మావయ్యని గదిలో నుంచి కిందకి తీసుకొస్తుంది. అది చూసి రాజ్యలక్ష్మి కోపంగా ఎందుకు తీసుకొచ్చావని అరుస్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today November 5th: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌ని అవమానించిన మాలిని! సూరజ్‌ని మాలినికి దూరం చేయడానికి బావామరదళ్ల మాస్టర్ ప్లాన్!
కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌ని అవమానించిన మాలిని! సూరజ్‌ని మాలినికి దూరం చేయడానికి బావామరదళ్ల మాస్టర్ ప్లాన్!
Nindu Noorella Saavasam Serial Today: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి – అమర్‌ను చూసి భయపడిన చంభా   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి – అమర్‌ను చూసి భయపడిన చంభా   
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి ప్రియమణిి క్రైమ్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఫ్రీగా చూసెయ్యండి
డైరెక్ట్‌గా ఓటీటీలోకి ప్రియమణిి క్రైమ్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఫ్రీగా చూసెయ్యండి
Jagadhatri Serial Today Nov4:మూడు ముక్కలైన వజ్రపాటి కుటుంబం. ఒకే ఇంట్లో మూడు కుంపట్లు.
జగద్ధాత్రి సీరియల్:మూడు ముక్కలైన వజ్రపాటి కుటుంబం. ఒకే ఇంట్లో మూడు కుంపట్లు..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget