అన్వేషించండి

Gruhalakshmi December 21st: తులసి విలువ తెలుసుకుంటున్న నందు- బతికి అందరినీ బాధపెట్టడం ఎందుకంటున్న పరంధామయ్య

తులసి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తులసి ఇచ్చిన వాక్ మెన్ బాగు చేసి సామ్రాట్ ఇంట్లో పెడతాడు. అందులో నుంచి తల్లి చిన్నప్పుడు పాడిన పాట విని తులసి చాలా ఎమోషనల్ అవుతుంది. తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. ఆ వాక్ మెన్ ఇక్కడికి ఎలా వచ్చిందని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ అది ఎలా వస్తుంది నేనే తీసుకొచ్చాను అని ఎంట్రీ ఇస్తాడు. చాలా థాంక్స్ అని చెప్తుంది. ‘నా సంతోషమే కాకుండా నా బిడ్డ సంతోషం కూడా తిరిగి తీసుకొస్తున్నావ్. నిన్ను మా కోసమే దేవుడు పంపించాడు’ అని సరస్వతి అంటుంది. ‘మా అమ్మ జీవితంలో ఆ వాక్ మెన్ కి ఉన్న స్థానం వేరు, నేను చేయలేని పని మీరు చేశారు చాలా థాంక్స్’ అని తులసి కూడా చెప్తుంది.

నందు అసహనంగా ఉండటం చూసి తన చేతకాని తనాన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవాలని లాస్య అనుకుంటుంది. ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళావ్ కదా ఏమైందని లాస్య అడిగేసరికి రాలేదని వస్తే ఇలా కూర్చుంటానా అని చిరాకుగా చెప్తాడు. ఇంటి బిల్లులన్నీ కట్టాలని లాస్య చెప్తుంది. ఇవన్నీ ఇంతక ముందు ఎవరు కట్టారని నందు అడిగితే తులసి చూసుకుంది తనకి చెప్పమంటావా అని అంటుంది.

నందు: అభి, ప్రేమ్ కి చెప్పొచ్చు కదా

లాస్య: డాడ్ కి చెప్పమని అంటారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడలేను కదా

నందు: నా పరిస్థితి తెలుసు కదా జాబ్ లేదు డబ్బులు లేవు నేనేం చెయ్యను. అప్పు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది

Also Read: బాపు బొమ్మలా వేద, కన్నార్పకుండా చూస్తున్న యష్- మాలిని మీద కస్సుబుస్సులాడిన సులోచన

ఇలా బెదిరిస్తే కానీ నువ్వు నా గుప్పెట్లో ఉండవు. నువ్వు సెటిల్ అయ్యేలోపు నీ ఫ్యామిలీని అన్ సెటిల్ చేస్తాను అని లాస్య మనసులో అనుకుంటుంది. తనకి సర్ ప్రైజ్ ఇచ్చినందుకు తులసి కూడా సామ్రాట్ కి పార్టీ ఇస్తానని చెప్తుంది. అనసూయ మందులు చూస్తూ ఉంటుంది. రేపటితో ఉన్న ట్యాబ్లెట్లు అన్నీ అయిపోతాయి, ఇక మనం వేసుకోవడానికి ఉండవు అని అనసూయ పరంధామయ్యతో అంటుంటే నందు వింటాడు.

పరంధామయ్య: మందులు లేకపోతే ఎలా నందుకి చెప్పు

అనసూయ: వాడికి ఉద్యోగం లేదు ఖర్చులకి వెతుక్కుంటున్నాడు, ఇక మనకి మందులు ఏం కొనిస్తాడు. వాడి పరిస్థితి చూస్తుంటే జాలిగా ఉంది. వాడు పోషించే స్థోమత ఉన్నప్పుడు మనం దగ్గరగా లేము. వాడికి ప్రేమ వచ్చేసరికి పోషించే స్థోమత లేకుండా పోయింది వాడిని బాధపెడుతున్నాం. వాడికి ఉద్యోగం వస్తేనే మన కష్టాలు గట్టెక్కేది

నందు: అమ్మనాన్నని తులసి దగ్గరే ఉంచాల్సింది, వాళ్ళని ఇక్కడ ఉంచి బాధపెడుతున్నా

పరంధామయ్య: మన మందుల గురించి అభి, ప్రేమ్ కి చెప్పకపోయావా

అనసూయ; చెప్దామని అనుకున్నా కానీ ఇంటి ఖర్చులన్నీ వాళ్ళే చూస్తున్నారు మళ్ళీ మందులు గురించి చెప్పడానికి నోరు రాలేదు

పరంధామయ్య; మన మందుల కోసం ఎవరిని బాధపెట్టొద్దు. మనం బతికి ఉండి పైసాకి కూడా ఉపయోగం లేదు. మిగిలిన ట్యాబ్లెట్స్ అలాగే ఉంచు రోజు టైమ్ కి వాటిని తీసుకొస్తే వేసుకుంటున్నాం అనుకుంటారు

Also Read: పరాధాన్యంలో తులసి, సామ్రాట్- శ్రుతి, అంకిత రేషన్ బాధలు

అప్పుడే ఇంటికి మందుల పార్సిల్ వస్తుంది. పరంధామయ్యకి తులసి మందులు పంపిస్తుంది. అది తీసుకుని ‘నీ విలువ ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది తులసి, నువ్వు ఇక్కడ లేకపోయినా ఉన్నట్టే థాంక్స్ మా అమ్మానాన్న ప్రాణాలు కాపాడుతున్నావ్’ అని నందు మనసులో అనుకుంటాడు.  

మందులు తెచ్చి తల్లితండ్రులకి ఇస్తాడు. అవి నందు తెచ్చాడని అనుకుంటారు. తులసి ఉన్నప్పుడు కూడా అంతే మందులు అయిపోయేది చెప్పకుండానే తెలుసుకుని తెచ్చేది అని అనసూయ అంటుంది. ఆ మాటకి నందు ఇప్పుడు పంపించింది కూడా తులసినే మీ కొడుక్కు కొనే శక్తి లేదు క్షమించండి అని బాధగా అడుగుతాడు. అప్పుడే తులసి ఫోన్ చేసి ట్యాబ్లెట్లు వచ్చాయా అని అడుగుతుంది. తన మాటలు విని ముసలోళ్ళు బాధపడతారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget