Gruhalakshmi April 21st: దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ జరగకుండా చేసిన రాజ్యలక్ష్మి- తులసికి నందు నిజం చెప్పేస్తాడా?
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్య వాళ్ళని మొదటి రాత్రికి తీసుకుని వెళ్దామని తులసి, నందు రాజ్యలక్ష్మి దగ్గరకి వస్తారు. అలా కుదరదు ముందు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు రాత్రులు కూడా మా ఇంట్లోనే జరగాలని రాజ్యలక్ష్మి ఖరాఖండిగా చెప్తుంది. దీంతో తులసి సరే అంటుంది. ప్రియ దిగులుగా ఉండటం చూసి దాచకుండా నిజం చెప్పమని దివ్య నిలదీస్తుంది. నువ్వు గీత దాటితే మీ పెద్దలు గీత దాటుతారని రాజ్యలక్ష్మి తనని బెదిరించిన విషయం ప్రియ గుర్తు చేసుకుంటుంది. ప్రతి కష్టాన్ని పైకి చెప్పుకోలేమని ప్రియ వేదాంతం చెప్పుకొస్తుంది. అత్తయ్యతో ఎటువంటి ఇబ్బంది ఉండదు, సంజయ్ వల్ల నువ్వు బాధపడుతున్నావ్ కదా నేను అడుగుతానని అంటుంది. తులసి దివ్య కోసం ఇంట్లో కళ్ళతోనే వెతుకుతుంది. వ్రతానికి అందరినీ రమ్మని రాజ్యలక్ష్మి పిలుస్తుంది.
Also Read: స్వప్నకి వార్నింగ్ ఇచ్చిన కావ్య- భార్యని వదిలేసి రాజ్ ని ఇంట్లో అడుగుపెట్టమన్న అపర్ణ
దివ్యని పిలిస్తే చూసి వెళ్లిపోతామని తులసి అడుగుతుంది. నేను బాగా చూసుకుంటున్నాన లేదా అని అనుమానమా అంటుంది. మాకు దిగులుగా ఉంటుంది కదా అది సంతోషంగా ఉంటే మాకు సంతోషమేనని తులసి అంటుంది. ఒకసారి దివ్యని పిలిస్తే చూస్తానని మళ్ళీ అడుగుతుంది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం దివ్య నిద్రపోతుందని అబద్ధం చెప్తుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పమని ప్రియని నిలదీస్తుంది. దివ్యకి నిజం చెప్పేస్తానని ప్రియ అనుకునేలోపు దేవుడు వచ్చి మీ అమ్మానాన్న వచ్చారని చెప్పేసరికి టను పరుగున వెళ్ళిపోతుంది. దివ్యని చూడకుండానే దిగులుగా తులసి వాళ్ళు వెనుతిరుగుతారు. తులసి వాళ్ళు గుమ్మం దాటిన తర్వాత దివ్య పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి తల్లిదండ్రుల కోసం వెతుకుతుంది. మా అమ్మ వాళ్ళు ఎక్కడ అని అంటే వాళ్ళు వెళ్లిపోయారని చెప్పేసరికి దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకున్నా అప్పుడు అందరూ వస్తారు తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే అని దివ్యకి మాయ మాటలు చెప్తుంది. దీంతో బాధగా వెళ్ళిపోతుంది. ఇక నుంచి నీ పుట్టింటి వాళ్ళతో సంబంధాలు ఉండవని రాజ్యలక్ష్మి సంబరపడుతుంది. నందు డల్ గా ఉండటం చూసి ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది. దివ్య పెళ్లి అయిన రోజు నుంచి మీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇంతటి దిగులు ఎప్పుడు చూడలేదు. ఎవరూ చూడటం లేదనుకుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎందుకని ప్రశ్నిస్తుంది. నందు దివ్య గురించి చెప్పి బాధపెట్టడం ఎందుకని చెప్పకుండా ఒక్కడినే బాధపడుతున్నానని మనసులో అనుకుంటుంది. లాస్య నందు వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది. రాజ్యలక్ష్మి వాళ్ళ మొహాన పేడ నీళ్ళు చల్లి ఉంటుందని సంబరపడుతుంది. దివ్య వాళ్ళని తీసుకురాకుండా వచ్చేసరికి అందరూ బాధపడతారు. నందు దిగులుగా వెళ్ళి లోపల కూర్చుంటాడు.
Also Read: యష్ షాకింగ్ డెసిషన్- వేదకి విడాకులు, అయోమయంలో వసంత్
మన పద్ధతులు ఆచారాలు వాళ్ళకి చెప్పొచ్చు కదా పరంధామయ్య అడుగుతాడు. దివ్యని తీసుకురాకుండా అడ్డు పడింది ఎవరు వాళ్ళ అత్తగారా అని ప్రేమ్ సీరియస్ అవుతాడు. ఆవేశంగా అడుగుతానని అనేసరికి లాస్య భయపెట్టేలా మాట్లాడుతుంది. అలా చేస్తే కోడలికి, అత్తకి మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుందని అనేసరికి తులసి నిజమేననుకుని మౌనంగా ఉంటుంది. రాజ్యలక్ష్మి చేసిన పనిని మెచ్చుకుంటూ మరింత ఆజ్యం పోసేలా బసవయ్య వాళ్ళు రెచ్చగొడతారు. విక్రమ్ వాళ్ళ ఫస్ట్ నైట్ జరకుండా చేయడానికి రాజ్యలక్ష్మి ప్లాన్ వేస్తుంది. అది జరిగితే విక్రమ్ దివ్య చేతిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఏమి చేయలేమని అంటుంది. వాడు ఎప్పుడు నా చేతిలో కీలు బొమ్మలాగే ఉండాలి ఉండేలా చేసి దివ్యని ఆడిస్తానని అంటుంది.