Gruhalakshmi September 3rd Update: తెగించిన నందు, లాస్య సంబరం- తులసి మీద కోపంతో రగిలిపోతున్న సామ్రాట్
తులసి సామ్రాట్ తో వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకున్నట్టు మెసేజ్ పెడుతుంది. అది చూసి సామ్రాట్ తులసి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
సామ్రాట్ అభి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. అసలు అలా మాట్లాడకుండా వెళ్లిపోవడంలో తన ఉద్దేశం ఏంటి తన పర్సనల్ విషయం నాకెందుకు అనుకుంటుందా. తన మనసులో ఏముందో ఇప్పటికైనా కాల్ చేసి నాతో చెప్పొచ్చు కదా, అసలు నన్ను పట్టించుకోవడం లేదేంటి, తులసి గారు నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారేమో నేనే కాల్ చేస్తాను అని సామ్రాట్ తులసికి ఫోన్ చెయ్యాలని అనుకుంటాడు. తులసి కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ సామ్రాట్ కి మెసేజ్ పంపిస్తుంది. ఏ సంతోషానికైనా బాధే ముగింపు అవుతుంది. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇంతవరకు మీరు చేసిన దానికి కృతజ్ఞతలు. ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నా అని తులసి మెసేజ్ పెడుతుంది. అది చూసి సామ్రాట్ షాక్ అయి కోపంగా ఉంటాడు.
సామ్రాట్ మెసేజ్ చూసి తులసి బాధపడుతుంది. దేవుడు అన్ని అందరికీ ఇవ్వాలని అనుకోడు నాకు ఇదే ప్రాప్తం ఏమో అని ఫీల్ అవుతుంది. సామ్రాట్ కోపంగా తన బాబాయ్ దగ్గరకి వచ్చి మీ తులసి ఏమనుకుంటుంది అని అరుస్తాడు. తను నీ బిజినెస్ పార్టనర్ అని అంటాడు. అసలు ఈడి పద్ధతేనా న ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి తనకి ఇంపార్టెన్స్ ఇస్తే తను ఏం చేసిందో తెలుసా ఈరోజుతో మీ భాగస్వామ్యానికి వదులుకుంటున్నా అని సింపుల్ గా మెసేజ్ పెట్టిందని కోపంగా చెప్తాడు. నిజం దాచింది తను, తప్పు చేసింది తను,ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సింది పోయి ఇలా మెసేజ్ పెడుతుందా అని అరుస్తాడు. అసలు ఎందుకు ఎగురుతున్నావ్ తులసి చేసిన తప్పేంటి అని పెద్దాయన అడుగుతాడు.
నందు తన మాజీ భర్త అని నాతో చెప్పకపోవడం తప్పు కదా అని అంటాడు. ‘నువ్వు అడిగావా అయినా నువ్వు ఎవరివని తను నీకు చెప్పడానికి, ఆవిషయానికి వస్తే నీ జీవితంలో కూడా పైకి చెప్పని నిజాలు చాలానే ఉన్నాయి అవన్నీ నువ్వు తులసికి చెప్పావా, తన లైఫ్ లో విషయాలు చెప్పకపోవడం తన ఇష్టం’ అని అంటాడు. తులసి ఒక్కదాన్నే అంటావే నందు కూడా చెప్పలేదు కదా అని అడుగుతాడు. నందు వేరు తులసి వేరు నేను తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా నాతో ఇలాగేనా ఉండేది, ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఎంత ఖర్చు పెడుతున్నా ఈడి ఆగిపోతే నా పరువు ఏం కావాలి అని సామ్రాట్ కోపంగా అంటూ ఉంటాడు.
నీ ఉక్రోషంలో ప్రాజెక్ట్ ఆగిపోయిన బాధ కనిపించడం లేదు తులసి ఇక నీ కంటికి కనిపంచదు అనే బాధ కనిపిస్తుంది, తను అంటే నీకు ఇష్టం, ప్రేమ అసలు నిజం ఒప్పుకో ఈ డొంకతిరగుడు ఎందుకు అని పెద్దాయన అడిగేస్తాడు. ప్రేమ్ శ్రుతి చీరలన్నీ తీసుకొచ్చి బయట పడేస్తాడు. ఉతికిన చీరలు తీసుకొచ్చి ఇలా మట్టిలో పడేస్తావ్ ఏంటి అని శ్రుతి అడుగుతుంది. తన చీరల మీద నీళ్ళు పోసి శ్రుతిని ఆడుకుంటాడు. ఇవన్నీ నేను ఉతకలేను ప్లీజ్ అని బతిమలాడుతుంది కానీ ప్రేమ్ వినకుండా నీళ్ళు పోసేస్తాడు.
Also Read: న్యాయం చేస్తానని జెస్సీకి మాటిచ్చిన జానకి- జెస్సీతో కలిసున్న ఫోటోలు జానకి ఫోన్లో డిలీట్ చేసిన అఖిల్
తులసి నందు, లాస్య ఇంటికి వస్తుంది. మన ఇద్దరి మధ్య పెద్ద మనుషుల తరహా ఒప్పందం ఉంది. కానీ మీరే ఆ ఒప్పందాన్ని అతిక్రమించి మీరే నిజం చెప్పారు అని తులసి అంటుంది. దాని వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటని నందు అంటాడు. నేను సామ్రాట్ గారి దగ్గర నిజం దాచాను అని అనుకుంటున్నారు, అది వాస్తవం కాదు నేను కొరబట్టే నేను నిజం దాచాను అని సామ్రాట్ గారి దగ్గర చెప్పమని నందుని అడుగుతుంది. దానికి నందు వాళ్ళు పగలబడి నవ్వుతారు. తులసి గురించి హేళనగా మాట్లాడుతుంది. అది చూసి తులసి కోప్పడుతుంది. నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోడానికి మేము బలి కాలేమని నందు అంటాడు. వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నట్టు నేను ఎప్పుడో మెసేజ్ చేశాను అని చెప్తుంది.
‘నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను కానీ ఒక కండిషన్ నువ్వు కోరుకున్న నిజంతో పాటు నువ్వు సామ్రాట్ దగ్గర దాచిన నిజం కూడా చెప్పేస్తాను. హనీకి యాక్సిడెంట్ చేసింది నేనే అనే నిజాన్ని దాచావ్ కదా అది ఇప్పుడు నేనే చెప్పేస్తాను, కావాలనే నువ్వే నిజం దాచావని చెప్తాను, నీకేమి అభ్యంతరం లేదు కదా, నేను తెగించేశాను శిక్షకి రెడీ అయిపోతాను’ అని నందు తులసిని బెదిరిస్తాడు. మంచితనంతో నేను చేసిన దాన్ని ఇలా వాడుకుంటారా ఇంతకింతకీ అనుభవిస్తారు అనేసి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తరువాయి భాగంలో..
నందు, లాస్య సామ్రాట్ దగ్గరకి వస్తారు. సమయం చూసహుకుని నందు తులసి మాజీ భర్త అని చెప్పాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాము కని తులసి ఆపేసిందని లాస్య ఎక్కిస్తుంది. మిమ్మల్ని మోసం చెయ్యాలని ఉద్దేశం మాకు లేదని నందు అంటాడు. తులసి నా ఇగో మీద దెబ్బ కొట్టింది నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్ పట్టాలేక్కక ముందే వైండప్ అయిందంటే నా పరువు పోయినట్టేగా అని సామ్రాట్ కోపంతో రగిలిపోతాడు. ఇది ఒక రకంగా మీరు ఒడిపోయినట్టే అని లాస్య ఎక్కిస్తుంది. మీరే ఎలాగైనా ఈ ఓటమి నుంచి బయట పడేయాలని అడుగుతాడు. మా ప్రాజెక్ట్ కి ఒకే చెప్తాడెమో లాస్య సంబరపడుతుంది.