News
News
X

NBK 108 Shoot Postponed : తారక రత్న మరణంతో మళ్ళీ బాలకృష్ణ సినిమా షూటింగ్ వాయిదా!?

తారక రత్న మరణంతో నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా లేటెస్ట్ షెడ్యూల్ వాయిదా వేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే...

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడనుందని సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే...

తారకరత్న మరణంతో...
బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 గా వ్యవహరిస్తున్నారు. జనవరి నెలాఖరున ప్రారంభంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున కుప్పంలో పాల్గొన్న బాలకృష్ణ ఆ తర్వాత హైదరాబాద్ రావాలనేది ప్లాన్. తారక రత్నకు గుండెపోటు రావడంతో అనూహ్యంగా ఆయన షెడ్యూల్ మారింది. కుప్పం నుంచి తారక రత్నను బెంగళూరు తీసుకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండటంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు.
 
క్యాన్సిల్ అయిన NBK 108 షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారం తర్వాత ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు తారక రత్న మరణంతో మరోసారి షెడ్యూల్ వాయిదా పడవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నారు. తారక రత్న అంతిమ సంస్కారాలు, పెద్ద కర్మ పూర్తి అయిన తర్వాత మళ్ళీ బాలకృష్ణ షూటింగులు స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతున్నారట. 

Also Read రామ్ చరణ్‌తో కాదు, కన్నడ హీరోతోనే కన్నడ దర్శకుడి నెక్స్ట్ సినిమా 

ఈ సినిమాలో నందమూరి అందగాడితో తెలుగు తెర చందమామ జోడీ కడుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో బాలకృష్ణది సింగిల్ క్యారెక్టర్ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినప్పటికీ... డ్యూయల్ షేడ్స్ ఉంటుందని టాక్. అంటే... యంగ్ వెర్షన్ కూడా ఉంటుందట. యంగ్ బాలయ్యకు జోడీగా కాజల్ కనిపించే అవకాశం ఉంది. 

బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు. 

Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి... 

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు అమ్మాయి, కథానాయిక అంజలి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... హ్యాట్రిక్ అన్నమాట. దీని తర్వాత 'అఖండ 2' కూడా చేయనున్నారు. ఆ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు. 

Published at : 19 Feb 2023 02:45 PM (IST) Tags: kajal aggarwal Balakrishna Anil Ravipudi NBK 108 Update Taraka Ratna Death

సంబంధిత కథనాలు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Maadhav Bhupathiraju Debut Movie : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!

Maadhav Bhupathiraju Debut Movie : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు