అన్వేషించండి

Chiranjeevi 157 Movie: చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?

Chiranjeevi Birthday: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, కుమార్తె నిర్మాణంలో చేయాలనుకున్న కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుందని అనుకుంటే రాలేదు.

తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా నిర్మించాలని పెద్ద కుమార్తె సుస్మిత చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. అలాగే, చిరంజీవితో సినిమా చేయడమే తన లక్ష్యం, ధ్యేయం అని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ చాలా ఏళ్లుగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా అనుకున్నా... ఆఖరికి కలసి చేద్దామని ఫిక్స్‌ అయ్యారు. అయితే... ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఇంకా తేలడం లేదు. 'ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని అన్నారు కదా' అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. కానీ, అక్కడ పరిస్థితి అలా లేదని టాక్. 

కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
సినిమా సెట్స్‌ మీద ఉండగానే తర్వాతి సినిమాను ఓకే చేసేసి పట్టాలెక్కించడానికి అన్నీ ప్లాన్‌ చేసుకునే రకం చిరంజీవి. ఆయన స్టార్‌ హీరో అయినప్పటి నుండి ఇదే స్టైల్‌ కొనసాగిస్తున్నారు కూడా. కరోనా తర్వాత అయితే ఏకంగా నాలుగు సినిమాలు లైనప్‌లో పెట్టారు. దీంతో 'విశ్వంభర' సినిమా తర్వాత ఏంటి అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఆ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది కాబట్టి కొత్త సినిమా త్వరలోనే అనౌన్స్‌ చేస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం తేలడం లేదు. 

చిరంజీవి 157వ సినిమా కోసం బీవీఎస్‌ రవి ఓ కథ సిద్ధం చేశారని చాలా నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అది నిజమే కూడా! ఇదిగో, అదిగో అంటూ ఆ సినిమా గురించి అక్కడా, ఇక్కడా మాటలు వినిపిస్తున్నాయి. ఆయన అందించిన కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి సినిమా చేయడానికి చిరంజీవి చాలా మంది దర్శకులకు ఛాన్స్‌ ఇచ్చారని కూడా విన్నాం. ఆఖరిగా 'గాడ్‌ ఫాదర్‌' దర్శకుడు మోహన్‌ రాజా కోర్టులో బంతి ఉందని తేలింది. కానీ ఇప్పుడు అక్కడి నుండి వేరే దగ్గరకు కథ వెళ్తోంది అంటున్నారు. 

కొన్ని రోజులుగా ఈ సినిమా మీద పని చేసిన మోహన్‌ రాజా టీమ్‌ ఇప్పుడు చేయడం లేదట. దానికి కారణం స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి సంతృప్తి చెందకపోవడమే అని అంటున్నారు. దీంతో ఆ కథ ఇప్పుడు వేరే దర్శకుడి దగ్గరకు వెళ్తుంది అని చెబుతున్నారు. అసలు ఆ కథ ఏ జోనర్‌ అనేది ఇప్పటివరకు ఎక్కడా లీకు రాలేదు. అయితే మోహన్‌ రాజా వరకు వెళ్లింది కాబట్టి యాక్షన్‌ థ్రిల్లర్‌ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఓకే అవ్వలేదు.

Also Readమీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?


ఈ నేపథ్యంలో ఈ రోజు వస్తుంది అనుకున్న ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇంకా రాలేదు అని చెబుతున్నారు. దర్శకుడు తేలకుండా అనౌన్స్మెంట్‌ ఇస్తే బాగుండదు అని టీమ్‌ అనుకుంటోందట. ప్రస్తుతం ఓ ముగ్గురు దర్శకుల పేర్లు చిరంజీవి మనసులో ఉన్నాయని... వారిలో ఒకరికి సినిమా కథ అప్పగిస్తారని చెబుతున్నారు. ఆ ముగ్గురూ యువ దర్శకులే అని చెబుతున్నారు. ఈ విషయంలో ఒకట్రెండు రోజులలో క్లారిటీ రావొచ్చు అంటున్నారు. కుమార్తె నిర్మాణంలో చేయబోయే సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు? అంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని  చిరంజీవి అనుకోవడమే కారణం అట! తొందర పడి పట్టాలు ఎక్కించకుండా జాగ్రత్త పడుతున్నారట.

Also Read: త్రిశూలంతో చిరంజీవుడు... మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget