Nithiin: నితిన్ అభిమానులకు డబుల్ బొనాంజా... రెండు నెలల్లో రెండు సినిమాలతో డేరింగ్ స్టెప్
Nithiin : నితిన్ త్వరలోనే తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గనుక 40 రోజుల్లో రెండు సినిమాల రిలీజ్ లతో నితిన్ డేరింగ్ స్టెప్ వేస్తున్నట్టే.

టాలీవుడ్లో స్టార్ హీరోలు ఒక్కో సినిమా చేయడానికి ఏడాదికి పైగానే టైం తీసుకుంటున్నారు. కానీ యంగ్ హీరోలు మాత్రం అలా కాకుండా ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా నితిన్ కూడా చేరిపోయాడు. ఈ హీరో కేవలం 40 రోజుల్లోనే తన అభిమానులకు రెండు సినిమాలతో డబుల్ బొనాంజా ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
నితిన్ డేరింగ్ స్టెప్
ఏడాదికి 2 సినిమాలు చేస్తేనే ఎక్కువ అనుకునే పరిస్థితిలో ఉన్నారు టాలీవుడ్ స్టార్స్. కానీ కొంతమంది యంగ్ హీరోలు మాత్రం ఏడాదికి 3 సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇలా తక్కువ రోజుల వ్యవధిలో రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలలో నితిన్ కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నితిన్ కేవలం 40 రోజుల్లోనే రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నితిన్ హీరోగా నటిస్తున్న హీస్ట్ థ్రిల్లర్ 'రాబిన్ హుడ్' మూవీని మార్చి 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'భీష్మ' తర్వాత సూపర్ హిట్ కాంబో దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ చేస్తున్న సినిమా ఇది. వరుస డిజాస్టర్ల తర్వాత నితిన్ కు ఈ సినిమా చాలా కీలకంగా మారబోతోంది.
తాజా పరిణామాల మధ్య నితిన్ తన నెక్స్ట్ మూవీ 'తమ్ముడు'ని కూడా మేలోనే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు గానీ, మేకర్స్ మాత్రం మూవీ రిలీజ్ డేట్ విషయమై ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక 'తమ్ముడు' మూవీ గురించి ఇప్పటిదాకా పెద్దగా ప్రచారం ఏమీ జరగలేదు. మరోవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మే 9న మూవీని రిలీజ్ చేసే ఆలోచనతోనే మేకర్స్ నిర్మాణ కార్యకలాపాలను చాలా వేగంగా జరుపుతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' మూవీ క్లాసిక్ టైటిల్ నితిన్ తన సినిమా కోసం వాడుకోవడంతో సినిమాపై కొంతవరకు అంచనాలు నెలకొన్నాయి.
40 రోజుల్లో 2 సినిమాల రిలీజ్... కారణం ఇదేనా ?
మేకర్స్ అనుకున్నట్టుగా ఈ ప్లాన్స్ అన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగితే 'రాబిన్ హుడ్' మూవీ మార్చ్ 28న థియేటర్లలోకి వస్తుంది. అలాగే 'తమ్ముడు' మూవీ 'రాబిన్ హుడ్' రిలీజ్ అయిన నెలన్నర రోజుల్లోనే అంటే మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఇటీవల కాలంలో రిలీజ్ డేట్స్ దొరకడం అనేదే చాలా కష్టంగా మారింది. అలాంటిది నితిన్ నెల రోజుల్లోనే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, గత ఏడాదే 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడడంతో నితిన్ తన సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది. దీనివల్ల 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' రెండు సినిమాలు అతి తక్కువ గ్యాప్ తో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

