Samantha: చైతన్యతో విడాకులకు ముందే సమంత జీవితంలో రాజ్... తప్పుచేసి మాజీ భర్తపై నిందలా?
Raj Nidimoru: రాజ్ నిడమోరుతో సమంత రిలేషన్ షిప్ రూమర్స్ వ్యవహారంలో తాజాగా సమంతను నెటిజన్లు వేలెత్తి చూపుతున్నారు. రాజ్, భార్య శ్యామాలి డివోర్స్ తీసుకున్నారంటూ ప్రచారం సాగగా అందుకు సామ్ కారణమంటున్నారు.

Netizens Accuses Samantha Of Hypocrisy: చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత ఇటీవల 'శుభం'తో సక్సెస్ అందుకున్నారు. అయితే, ఆ సినిమా ప్రమోషన్లలో ఆమె చేసిన సందడి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఇందులో భాగంగానే డైరెక్టర్ రాజ్ నిడమోరుతో ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి.
సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజ్ భుజంపై వాలిన ఫోటోలు షేర్ చేయగా వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లయింది. త్వరలో వీరిద్దరూ ఒక్కటవ్వబోతున్నారంటూ కొన్ని ఆంగ్ల మీడియాల్లో కథనాలు సైతం వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన సమంత మేనేజర్ అవి రూమర్స్ మాత్రమేనని ఖండించారు.
సమంతపై నెటిజన్ల ఫైర్
ఈ రూమర్స్ నేపథ్యంలోనే రాజ్ భార్య శ్యామాలి సైతం ఇటీవల చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమంత, రాజ్‌లపై వస్తోన్న రూమర్స్ కారణంగానే ఆమె ఇలా పోస్ట్ పెట్టారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగింది. అయితే, దీనికి సమంతనే కారణమంటూ నెటిజన్లు తాజాగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి రాజ్ - డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' షూటింగ్ టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ వచ్చాయి.
నాగచైతన్యతో పెళ్లికి ముందే సమంతకు రాజ్‌కు పరిచయం ఉందని.. అంతకు ముందు నుంచే రాజ్ జీవితంలో ఆమె ఉన్నారని అంటున్నారు. సమంత కారణంగానే డైరెక్టర్ రాజ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ షూటింగ్ తర్వాత 2021లో నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్నారని చెబుతున్నారు.
Also Read: నా అన్వేషణ To అలేఖ్య చిట్టి పికిల్స్ వరకూ.. - వైరల్ కంటెంట్ ఫుల్లుగా వాడేసిన 'బెట్టింగ్ భోగి'
శోభితపై అప్పట్లో విమర్శలు
మరోవైపు, సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాల నాగచైతన్య జీవితంలోకి ప్రవేశించారు. వీరిద్దరూ ఫిబ్రవరి 2023లో ఒక చెఫ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కనిపించగా.. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే, సమంత, నాగచైతన్య విడిపోవడానికి శోభితనే కారణమంటూ అప్పట్లో ట్రోలింగ్ సాగింది. అయితే, ఇందులో నిజం లేదని.. శోభితను అనవసరంగా ఇందులోకి లాగారంటూ నెటిజన్లు తాజాగా కామెంట్ చేస్తున్నారు.
అప్పట్లో సమంతను బాధితురాలిగా చూసేవారమని.. ఇప్పుడు రాజ్ నిడమోరు వ్యవహారంలోనూ సామ్ అలానే చేస్తుందంటూ ఆమెను తప్పుబడుతున్నారు నెటిజన్స్. అప్పట్లో సమంత పీఆర్ టీం నాగచైతన్య, శోభితలను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేశారని.. ఇప్పుడు సమంత చేస్తుంది కూడా అదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజ్, సమంతకు ఉన్న రిలేషన్ గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అప్పట్లో సమంతను బాధితురాలిగా చూసిన నెటిజన్లు ఇప్పుడు రాజ్ భార్య శ్యామాలిని బాధితురాలిగా చూస్తున్నారు. అప్పట్లో శోభితను తప్పుబట్టి ఇప్పుడు సమంత అదే పని చేస్తుందంటూ చైతో పెళ్లికి ముందే ఆమె జీవితంలో రాజ్ ఉన్నారంటూ క్లారిటీ ఇస్తూ.. సమంతను వేలెత్తి చూపుతున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో చర్చలు, నెటిజన్ల ట్రోలింగ్ తప్ప ఈ అంశాలపై అటు రాజ్ నిడమోరు టీం కానీ.. ఇటు సమంత టీం కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. సామ్ మేనేజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చినా వీటికి చెక్ పడలేదు.





















