అన్వేషించండి

Samantha Treatment: సమంత ట్రీట్మెంట్‌కు స్టార్ హీరో సాయం? బాబోయ్! అంత డబ్బు ఇచ్చాడా?

సినిమాలకు కొంత కాలం పాటు విరామం ప్రకటించిన సమంత, ప్రస్తుతం తన ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది. ఆమె చికిత్స కోసం ఓ స్టార్ హీరో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన మేకప్ ఆర్టిస్ట్ అనూషతో కలిసి ఈస్ట్ ఏషియన్ కంట్రీలో సరదగా గడుపుతోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు అక్కడే ఉంటున్నారు. సమంత బాలి బీచుల్లో విశ్రాంతి తీసుకోవడంతో పాటు స్థానిక వంటకాలను హాయిగా ఆస్వాదిస్తోంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆనందంగా గడుపుతోంది. కొంతకాలంగా మైయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. బాలి వెకేషన్ లో తన ఆరోగ్య సమస్యలను మర్చిపోయి ఆహ్లాదంగా గడిపే ప్రయత్నం చేస్తోంది. అయితే, సమంత ట్రీట్మెంట్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఓ స్టార్ హీరో ఆర్థిక సాయంతో ట్రీట్మెంట్ పొందుతోందనే ప్రచారం జరుగుతోంది.

మైయోసైటిస్‌ చికిత్స కోసం సినిమాలకు విరామం

సమంత ‘యశోద’ సినిమా చేస్తున్న సమయంలోనే ఆమెకు మైయోసైటిస్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకుని మళ్లీ షూటింగ్ కంప్లీట్ చేసింది. పూర్తి స్థాయిలో వ్యాధి నయం కాకపోయినా, తన వర్క్ కమిట్ మెంట్స్ చాలా వరకు పూర్తి చేసింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ షూటింగ్‌ను పూర్తి చేసింది. వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ వెస్ సిరీస్ ను కూడా కంప్లీట్ చేసింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. కొంత మంది నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి చెల్లించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మైయోసైటిస్‌ పూర్తి స్థాయిలో నయం అయ్యేంత వరకు సినిమాలకు విరామం ప్రకటించింది.

సమంత చికిత్స కోసం స్టార్ హీరో ఆర్థిక సాయం

సమంత బాలి వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అయితే, ఆమె ట్రీట్మెంట్ కోసం టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో ఆర్థిక సాయాన్ని చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సదరు నటుడి నుంచి సమంత ఏకంగా రూ.25 కోట్లు అప్పు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే, అది ఫేక్ వార్త కావచ్చని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే.. స్టార్ హీరోయిన్‌ స్థాయిలో ఉన్న సమంత ఆర్థికంగా కూడా మంచి స్థాయిలో ఉంది. మరొకరి సాయం తీసుకునే అవసరం కూడా ఆమెకు లేదు. కావాలంటే.. ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేసి అడ్వాన్స్‌గా కూడా ఆ మొత్తాన్ని పొందవచ్చు. ఈ నేపథ్యంలో హీరో వద్ద అప్పు తీసుకోవడమనే వార్త ఫేక్ కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమంత రూత్ ప్రభు చివరిగా ‘శాకుంతలం’ చిత్రంలో కనిపించింది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కాళిదాసు నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ హిస్టారికల్ ఫాంటసీ డ్రామా ‘శాకుంతలం’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. అయితే, బాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడుతోన్నా.. అనారోగ్య కారణాల వల్ల ఆమె ఏ సినిమాకు సైన్ చేయలేదు.

Read Also: లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఐకానిక్ బంగ్లా కూల్చివేతకు నిర్ణయం! కారణం ఏంటో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Embed widget