అన్వేషించండి

Dhanush: తెలుగు నిర్మాతలకు షాక్ ఇస్తున్న ధనుష్ రెమ్యూనరేషన్... భారీగా డిమాండ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్!

Dhanush Remuneration: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నెక్స్ట్ ఓ మూవీ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ధనుష్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని టాక్ నడుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కేవలం తమిళంలోనే కాదు... తెలుగు, హిందీ భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన తెలుగు మార్కెట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇది టాలీవుడ్ లో ఉన్న ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్. కానీ నిర్మాతలకు మాత్రం ధనుష్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి షాక్ ఇస్తున్నారనే వార్త తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

తెలుగు నిర్మాతలకు షాక్ 
ఓవైపు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అన్ని భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకుంటుంటే, ధనుష్ మాత్రం తక్కువ బడ్జెట్ లోనే తమిళ, హిందీ సినిమాల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. ఇక ఆయనకు టాలీవుడ్ లో ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా ధనుష్ తమిళ సినిమాలన్నీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలా కాలం తర్వాత ధనుష్ టాలీవుడ్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ హీరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి 'సర్' అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 'కుబేర' అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత మరోసారి ధనుష్ - వెంకీ అట్లారీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.

అయితే తమిళ సినిమాలకు పెద్దగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని హీరో, తెలుగు సినిమాలకు మాత్రం భారీగా పారితోషకం అడుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. చాలామంది నిర్మాతలు తమిళంలో ధనుష్ కి పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో, ఆయన తెలుగు నిర్మాతలతో కలిసి పని చేయడం, లేదా సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించడం వంటివి చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నా ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మాత్రం షాకింగ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని అంటున్నారు. 

Also Read: రామ్ చరణ్‌తో ప్రభాస్ హీరోయిన్... పాన్ ఇండియా లెవల్‌లో సుకుమార్ మాస్టర్ ప్లాన్, మామూలుగా లేదుగా

తమిళ హీరోలకు ఫుల్ డిమాండ్ 
వెంకీ అట్లూరి మూవీ కోసం ధనుష్ ఏకంగా 60 కోట్ల పారితోషికాన్ని అడుగుతున్నారట. ఇది ధనుష్ కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ధనుష్ డిమాండ్ ను చూసి అయోమయంలో పడ్డట్టు టాక్ నడుస్తోంది. అయితే టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల కాలంలో తమిళ హీరోలను భారీ పారితోషకంతో అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. తెలుగు హీరోలు పాన్ ఇండియా బాట పట్టడంతో టాలీవుడ్ నిర్మాతలు మొదలు పెట్టిన ఈ ట్రెండ్ నే ధనుష్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధనుష్ వరుసగా తెలుగు దర్శకులపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' మూవీ చేస్తున్న ధనుష్, మరోసారి వెంకీ అట్లూరితో సెకండ్ టైమ్ వర్క్ చేయబోతుండదమే అందుకు నిదర్శనం.

Read Also'స్కై ఫోర్స్' రివ్యూ: దేశభక్తి సినిమా అక్షయ్‌ కుమార్‌కు హిట్ ఇచ్చిందా? లేదంటే ఇదీ ఫ్లాపుల పరంపరలో చేరుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget