Akhil Akkineni Zainab Ravdjee Wedding Date: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్... వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?
Akhil Akkineni Zainab Ravdjee Wedding Venue: అక్కినేని అఖిల్ - జైనాబ్ రావ్‌డ్జీల నిశ్చితార్థం గత ఏడాది నవంబర్ లో జరిగింది. తాజాగా ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి వేదిక, డేట్ డీటైల్స్ బయటకు వచ్చాయి.

అక్కినేని వారి ఇంట ఇటీవలే పెళ్లి భాజాలు మోగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో పెద్దల సమక్షంలో మూడు ముళ్ళు వేశాడు. ప్రస్తుతం ఈ కొత్త జంట సంతోషంగా గడుపుతోంది. నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహానికి ముందే నాగర్జున తన రెండో కుమారుడైన అఖిల్ అక్కినేనికి కూడా ఎంగేజ్మెంట్ అయ్యిందన్న గుడ్ న్యూస్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ జంట త్వరలోనే ఏడు అడుగులు వెయ్యబోతున్నారు. అయితే ఇప్పటిదాకా సస్పెన్స్ గా ఉన్న అక్కినేని అఖిల్- జైనాబ్ రావ్‌డ్జీల పెళ్లి వేదిక, డేట్ల సమాచారం వచ్చేసింది.
అన్న బాటలోనే తమ్ముడు
అక్కినేని అఖిల్ తన బ్రదర్ అక్కినేని నాగచైతన్య అడుగుజాడల్లోనే నడవబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ - జైనాబ్ ల పెళ్లి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా జరగబోతోంది. అలాగే ఈ జంట హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య తన కొత్త జీవితాన్ని తన తాత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ, అన్నపూర్ణ స్టూడియోలో వైవాహిక బంధానికి మొదటి అడుగు వెయ్యబోతున్నారు అని సమాచారం. ఇక ఈ పెళ్లికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ లిస్టులో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉంటారని అంటున్నారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్
మరోవైపు అఖిల్ అక్కినేని - జైనాబ్ ల పెళ్లి విదేశాల్లో జరగబోతుందని అంటున్నారు. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు. గత ఏడాది నవంబర్ 26 న అక్కినేని నాగార్జున స్వయంగా అఖిల్ - జైనాబ్ ల నిశ్చితార్థం జరిగింది అనే విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇద్దరి రొమాంటిక్ ఫోటోలు పోస్ట్ చేస్తూ తన కోడలిని పరిచయం చేశారు నాగ్.
Also Read: రాజా వారు రాణి గారు... తల్లిదండ్రులు కాబోతున్నారు - గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం
జైనాబ్ నటించిన సినిమా
పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్‌డ్జీ కుమార్తె జైనాబ్ రావ్‌డ్జీ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె ఇప్పుడు ముంబైలో ఉంది. 39 సంవత్సరాల వయస్సులో జైనాబ్ ఒక సక్సెస్ ఫుల్ పెయింటర్. అంతేకాదు జైనాబ్ ఒక సినిమాలో కూడా నటించదన్న విషయం తెలుసా? ఎమ్ఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన "మీనాక్సీ: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్" చిత్రంలో కనిపించింది. టబు, కునాల్ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంలో ఆమె నగ్మా స్నేహితురాలిగా నటించింది. ఇక జైనాబ్ ను అప్పుడే అక్కినేని ఫ్యామిలీ తన కుటుంబంలోకి ఆహ్వానించింది. చై-శోభిత పెళ్ళిలో కూడా జైనాబ్ సందడి చేసింది.





















