News
News
X

Golden Globes 2023: ‘RRR’ టీమ్‌కు చిరంజీవి, రెహమాన్ అభినందనలు

‘నాటు.. నాటు..’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి, ఏఆర్ రెహమాన్ సహా పలువురు సెలబ్రిటీలు ‘RRR’ టీమ్ కు అభినందనలు చెప్పారు.

FOLLOW US: 
Share:

అత్యంత ప్రతిష్మాత్మకపై గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై ‘RRR’ సినిమా సత్తా చాటుకుంది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’పాట ఆస్కార్ కు ఎంట్రీగా భావించే ఈ  అవార్డును అందుకుంది.  ఆ పాట‌కు సంగీతాన్ని అందించిన ఎంఎం కీర‌వాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ కేటగిరిలో అవార్డును అందుకున్న గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది. అంతర్జాతీయ స్టేజ్‌పై ఈ అవార్డు ప్రకటించగానే ‘RRR’ టీమ్ ఆనందంలో మునిగిపోయింది. 

అటు ఈ అవార్డును అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు చెప్తున్నారు.

ఇదో చారిత్రాత్మక విజయం- చిరంజీవి

‘నాటు.. నాటు..’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇదో చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. “బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు.. నాటు..’ పాటకు  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకున్న ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారికి అభినందనలు, హిస్టారిక్ అచీవ్ మెంట్ సాధించిన ‘RRR’ టీమ్, రాజమౌళికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘నాటు.. నాటు..’ పాటను చూసి ఇండియా గర్వపడుతుంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

అద్భుతం, ఇండియన్ అభిమానుల తరఫున శుభాకాంక్షలు- ఏఆర్ రెహమాన్

అటు ఆస్కార్ విజేత, ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలిపారు. “ఇదో నమ్మశక్యం కాని అద్భతం.. భారతీయ అభిమానుల తరఫున కీరవాణి గారికి శుభాకాంక్షలు. రాజమౌళి గారికి, ‘RRR’ టీమ్ కు కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు.    

Read Also: ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబోస్

Published at : 11 Jan 2023 12:14 PM (IST) Tags: Naatu Naatu Song a r rahman RRR Team Chiranjeevi Golden Globes 2023

సంబంధిత కథనాలు

బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?

బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?

Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!

Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

టాప్ స్టోరీస్

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం  !

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!