By: ABP Desam | Updated at : 11 Jan 2023 10:56 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@boselyricist/Instagram
భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరెక్కించిన చిత్రం ‘RRR’. దేశ విదేశాల్లోనూ సంచనల విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో అవార్డులను దక్కించుకున్నది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ అవార్డును అందుకుంది. 2 కేటగిరీల్లో అవార్డు కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలోనూ అవార్డు కోసం పోటీ పడింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’ అవార్డును దక్కించుకుంది. ఆ పాటకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి ఆ అవార్డును అందుకున్నారు.
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
pic.twitter.com/CGnzbRfEPk
ఎమోషన్ తో కంటతడి పెట్టిన చంద్రబోస్
‘నాటు.. నాటు..’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల ఆ పాట రచయిత చంద్రబోస్ ఎమోషన్ అయ్యారు. అవార్డు విన్నింగ్ తర్వాత ఓ జాతీయ చానెల్ తో మాట్లాడిన ఆయన.. తాను రాసిన పాట ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించలేదన్నారు. ఎంతో మంది అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కి నెట్టి ‘నాటు.. నాటు’ పాట ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆనంద భాష్పాలు రాల్చారు. తనకు పాట రాసే అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు చెప్పారు. పాటను అద్భుతంగా పాటిన రాహుల్ సిప్లిగంజ్ తో పాటు వెండి తెరపై అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ సహా అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. తాను రాసిన ఈ పాటకు ఇంత ఘనత దక్కడం పట్ల తన కుటుంబ సభ్యులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చంద్రబోస్ వెల్లడించారు. అటు ఆస్కార్ అవార్డు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’
ఇక 2022 మార్చి 24న విడుదలైన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది. స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్ అద్భుతంగా నటించి మెప్పించారు. జపాన్ లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నిజానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అనేవి ఆస్కార్ కు పునాదిగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్ ను సైతం అందుకుంటాయి. ఈ నేపథ్యంలో ‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అస్కార్ అవార్డ్స్ వేదికపైనా సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు. ఆస్కార్స్ లోనూ అవార్డును అందుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: నెగటివ్ రివ్యూలు వస్తేనేం, కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాలివే!
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి