News
News
X

Godfather Pre Release Event : 'గాడ్ ఫాదర్' ఫంక్ష‌న్‌కు ప‌వ‌ర్‌ఫుల్‌ టచ్ లేనట్టేనా!?

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారా? 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ప‌వ‌ర్‌ఫుల్‌ టచ్ ఇస్తున్నారా?

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫస్ట్ లుక్స్, టీజర్ విడుదల చేయడం మినహా ఇప్పటి వరకు పెద్దగా ప్రచార కార్యక్రమాలు ఏవీ ప్రారంభించలేదు. సాంగ్స్ రిలీజ్ వంటివి పక్కన పెడితే... ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అతిథిగా ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది.
 
'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్... 
పవన్ కళ్యాణ్ వస్తున్నారా!?
'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని... అన్నయ్య చిరంజీవితో కలిసి వేదికపై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని సమాచారం. అన్నయ్య కోసం తమ్ముడు ఈ ఫంక్షన్‌కు వస్తారని సెప్టెంబర్ తొలి వారంలో అనుకున్నారు. అయితే, బస్ యాత్ర వల్ల రాకపోవచ్చనే మాటలు వినిపించాయి. జనసేనాని బస్ యాత్ర వాయిదా పడటంతో ఆయనను ప్రీ రిలీజ్ (Godfather Pre Release Event) కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మళ్ళీ వార్తలు మొదలు అయ్యాయి. అయితే... పవన్ అమెరికా పర్యటన ఉందని, అందువల్ల బస్ యాత్ర వాయిదా వేశారని, ఆయన 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ వేడుకకు రావడం అనుమానమేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

అనంతపురంలో ఆ రోజే ప్రీ రిలీజ్ ఫంక్షన్!
సాధారణంగా సినిమా ఫంక్షన్లు హైదరాబాద్‌లో జరుగుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి విశాఖ, రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ మధ్య రాయలసీమ వెళ్లడం స్టార్ట్ చేశారు టాలీవుడ్ ప్రముఖులు. 'గాడ్ ఫాదర్' టీమ్ సైతం రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం (Anantapur) జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న మెగా అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ఈవెంట్ చేయనున్నారు. 

ఈ రోజు చిరు, సల్మాన్ సాంగ్ రిలీజ్'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ (Salman Khan) వస్తారా? రారా? అని తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా వస్తే... మెగా సోదరులతో పాటు బాలీవుడ్ మెగాస్టార్‌ను ఒకే వేదికపై చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది. సినిమాలో చిరు, సల్మాన్ ఓ పాటలో డ్యాన్స్ చేశారు. ఇటీవల ఆ సాంగ్ విడుదల అయ్యింది. ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు.

Also Read : జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్?

'గాడ్ ఫాదర్'కు మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్త, ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్, ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీత దర్శకుడు, నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు. 

Also Read : ట్రైలర్ ఎఫెక్ట్ - నాగార్జున నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు

Published at : 20 Sep 2022 11:52 AM (IST) Tags: chiranjeevi Pawan Kalyan Godfather Movie Godfather Pre Release Event Pawan To Attend Godfather Pre Release

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?