Godfather Pre Release Event Date : అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ - మెగాస్టార్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్
'గాడ్ ఫాదర్' (Godfather) ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్న మెగా ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తోంది. అంత కంటే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
అనంతపురంలో ఆ రోజే ప్రీ రిలీజ్ ఫంక్షన్!
సాధారణంగా సినిమా ఫంక్షన్లు హైదరాబాద్‌లో జరుగుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి విశాఖ, రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ మధ్య రాయలసీమ వెళ్లడం స్టార్ట్ చేశారు టాలీవుడ్ ప్రముఖులు. (Godfather Pre Release Event Venue Date Locked) 'గాడ్ ఫాదర్' యూనిట్ కూడా రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న మెగా అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ఈవెంట్ చేయనున్నారు.
సల్మాన్ ఖాన్ వస్తారా? రారా?
'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ (Salman Khan) వస్తారా? రారా? అని తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హిందీ సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. వీలు చూసుకుని వస్తే... టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ మెగాస్టార్‌ను ఒకే వేదికపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. సినిమాలో వాళ్ళిద్దరూ ఓ పాటలో డ్యాన్స్ చేశారు. ఇటీవల ఆ సాంగ్ విడుదల అయ్యింది. ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. 'గాడ్ ఫాదర్' చిత్ర బృందంపై సల్మాన్ ఖాన్ కాస్త కోపంగా ఉన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలు అయ్యాయి. నయనతార సినిమా వేడుకలు హాజరు కావడం అరుదు కాబట్టి ఆవిడ రాకపోవచ్చు.
'గాడ్ ఫాదర్'కు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్త, ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్, ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీత దర్శకుడు, నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు.
Also Read : ట్రైలర్ ఎఫెక్ట్ - నాగార్జున నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు
'గాడ్ ఫాదర్' సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కు ఇది తెలుగు రీమేక్ అనే విషయం తెలిసిందే. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ తెలుగులో చేశారు. మంజూ వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ నటించారు. 'గాడ్ ఫాదర్'తో పాటు అక్టోబర్ 5న అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' కూడా విడుదల కానుంది. ఆ సినిమాను కూడా హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందువల్ల, ఇద్దరు మిత్రులు చిరంజీవి, నాగార్జున మధ్య స్నేహపూర్వక పోటీ బాక్సాఫీస్ దగ్గర చోటు చేసుకోనుంది.
Also Read : రాజమండ్రిలో విలేజ్ సీక్వెన్స్ - చిరు, రవితేజ రెడీ!