అన్వేషించండి

Vishnu Manchu - Ginna Title Song : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్

విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'జిన్నా' సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల చేశారు.

విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'జిన్నా' (Ginna Movie). ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దీనికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాంచి ఎనర్జిటిక్ ట్యూన్ అందించారు.
 
'నా పేరు జిన్న రా...
అందరికి అన్న రా!
నకారల్ చేస్తే కిస్సా ఖల్లాస్ రా' అంటూ మొదలైన ఈ పాటను ప్రేమ్ రాశారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ పృథ్వీ చంద్ర ఆలపించారు.
 
'వచ్చిండు చూడు మన జిన్నా భాయ్...
తొడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్...
ఎప్పటికైనా ఎవడితోటి వీడికి పోటీ లేదురా

వీడి గుండె నిండా మండే ఫైర్ నిండి ఉందిరా
నీకు అంత దమ్ము ఉంటే వచ్చి ముందు నించోరా

వీడికింక ఎవరు అసలు సాటి లేరు లే...

రా... నువ్వొస్తే మంచి చెడ్డ రెండు నేర్పుతా!
కానీ నాతో పెట్టుకుంటే అసలు ఊరుకోను!
నీకు ఉన్న తీట తీర్చి తిప్పి పంపుతాను!' అంటూ 'జిన్నా' టైటిల్ సాంగ్ సాగింది. ఈ లిరిక్స్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

విజయ దశమికి 'జిన్నా' ట్రైలర్ లాంచ్!
Ginna Movie Trailer Release On Dussehra 2022 : తొలుత 'జిన్నా' సినిమాను విజయ దశమికి విడుదల చేయాలనుకున్నారు. అయితే... దసరాకు ట్రైలర్  విడుదల చేయనున్నట్లు విష్ణు మంచు తెలిపారు. సినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన పేర్కొన్నారు.  

అక్టోబర్ 5న చిరంజీవి 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్', బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న 'స్వాతి ముత్యం' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విష్ణు మంచు సినిమా వస్తే థియేటర్లలో గట్టి పోటీ ఉండేది. ఆయన సినిమాను వాయిదా వేయడం వల్ల ఆ పోటీ తప్పింది.

'జిన్నా' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద విష్ణు మంచు కన్నేశారు. తెలుగు  సహా హిందీ, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో ఫైట్లు, పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఒక్కో పాటకు ఒక్కో స్టార్ కొరియోగ్రాఫర్ చేత స్టెప్పులు కంపోజ్ చేయించారు. 'జిన్నా'లో 'గోలి సోడా' పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. గణేష్ ఆచార్య మరో సాంగ్ చేశారు. 'జిన్నా' టైటిల్ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. 

సన్నీ లియోన్... పాయల్... ఇద్దరు హీరోయిన్లు!
'జిన్నా'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించారు. ఈ సినిమా 'చంద్రముఖి' తరహాలో ఉంటుందని, బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధిస్తుందని విష్ణు మంచు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.

Also Read : మహేష్ సినిమా కోసం మస్త్ ఐటమ్ సాంగ్ రెడీ - రూట్ మార్చిన త్రివిక్రమ్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget