అన్వేషించండి
Advertisement
Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!
తన ఫ్యామిలీను కావాలనే హెరాస్ చేస్తున్నారని.. అందులో ఓ ప్రముఖ హీరో ఇన్వాల్వ్మెంట్ ఉందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'జిన్నా'. ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీపై వస్తోన్న ట్రోల్స్ గురించి తెలిసిందే. ముఖ్యంగా మంచు విష్ణుని బాగా టార్గెట్ చేస్తున్నారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారిని ప్రమోషన్స్ కోసం వాడుకుందామనుకున్న ఈ హీరో.. వారందరితో కలిసి ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.
ఈ చిట్ చాట్ లో మీమర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు విష్ణు. తన ఫ్యామిలీను కావాలనే హెరాస్ చేస్తున్నారని.. అందులో ఓ ప్రముఖ హీరో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పుకొచ్చారు.
''జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. అందులో 21 మంది ఎంప్లాయిస్ ఉన్నారు. వారు కేవలం నా ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ.. హెరాస్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించినప్పుడు వారు ఐపీ అడ్రెస్ లతో సహా డీటైల్స్ అన్నీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఆఫీస్ ఐపీ అడ్రెస్, అలానే జూబ్లీహిల్స్ లో ఓ ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీ అడ్రెస్ మాకు వచ్చాయి. మాపై వచ్చిన 85 శాతం ట్రోల్స్ ఆ ఆఫీస్ ల నుంచే వచ్చాయి. హద్దులు దాటి నెగెటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బులిచ్చారు. ఇదంతా మా ఎలెక్షన్స్ నుంచి ఎక్కువైంది. ఆ సమయంలో చాలా మంది నా దగ్గరకి వచ్చి ట్రోల్స్ గురించి పట్టించుకోవాలని చెప్పారు. కానీ నేను ఎలెక్షన్స్ తో బిజీగా ఉన్నాను. అందుకే పట్టించుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసిన వారిపై ఫోకస్ పెట్టాను. హెరాస్ చేయడమనేది కరెక్ట్ కాదు. ఎవరైతే డబ్బులిచ్చి ఇలా చేయించారో.. ఈమధ్య వారిపై ఆర్గానిక్ గానే ట్రోల్స్ వచ్చాయి. వాటికి నేను డబ్బులు ఇవ్వలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత
ఇక 'జిన్నా' సినిమా విషయానికొస్తే.. ఈ సింఎంతో పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు మంచు విష్ణు. అందుకే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. ఫైట్లు, పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఒక్కో పాటను ఒక్కో స్టార్ కొరియోగ్రాఫర్ చేత స్టెప్పులు కంపోజ్ చేయిస్తున్నారు. 'జిన్నా'లో ప్రభుదేవా ఒక సాంగ్ చేశారు. గణేష్ ఆచార్య మరో సాంగ్ చేశారు. ప్రేమ్ రక్షిత్ కూడా సాంగ్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు, కవలలు అరియానా - వివియానా ఆలపించారు. ఆ సాంగ్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది.
'జిన్నా'లో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరితో విష్ణు మంచు ఒక పాట చేశారు. ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. AVA ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందించారు. జి నాగేశ్వరరెడ్డి కథ రాశారు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion