Game of Thrones sequel: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో 9వ సీజన్!
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఈ వెబ్ సీరిస్‌కు సీక్వెల్ సీజన్స్ రానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones).. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ కలిసిన టీవీ షో ఇది. HBO నిర్మించిన ఈ టీవీ షోకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఎనిమిది సీజన్ల తర్వాత ఈ షోను ముగించేయడంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఈ షోకు ప్రీక్వెల్ వస్తుందని ప్రకటించినా.. తమకు సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో HBO గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
GOT సీజన్-8లో డేనెరిస్ టార్గారియన్ (మదర్ ఆఫ్ డ్రాగన్స్)ను హత్య చేసిన జాన్ స్నో (కిట్ హరింగ్టన్) పాత్రతో ఈ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘The Hollywood Reporte’ (హాలీవుడ్ రిపోర్టర్) కథనం ప్రకారం.. ఈ పాపులర్ సీరిస్ కొనసాగింపు కోసం నిర్మాణ సంస్థ కిట్ హారింగ్‌టన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ టీవీ షో చివరి సీజన్‌లో జోన్ స్నో తన అసలు పేరు ఏగాన్ టార్గారియన్ అని తెలుసుకుంటాడు. ఇనుప సింహాసనానికి తానే నిజమైన వారసుడని భావిస్తాడు. అయితే, అతడు వెస్టెరోస్‌ను వదిలి మళ్లీ నార్త్ ఆఫ్ ది వాల్‌కి ప్రయాణిస్తాడు. అంతటితో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ ముగుస్తుంది.
అయితే, ఈ సీజన్ క్లైమాక్స్ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ఆ షోకు కీలకమైన ప్రధాన పాత్ర డేనెరిస్‌ను చంపేయడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అలాగే, చివర్లో డేనెరిస్.. డ్రాగాన్‌తో విధ్వంసం సృష్టించడం అతిగా అనిపించింది. అప్పటివరకు అన్ని సీజన్లను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు క్లైమాక్స్ చూసి నిరాశకు గురయ్యారు. ఇక దీనికి సీక్వెల్ ఉండబోదని భావించిన ప్రేక్షకులు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశాలున్నాయి. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగాన్’ ప్రాణాలతో తిరిగి వస్తుందా? లేదా అనేది చూడాలి.
Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రీక్వెల్ ‘హౌస్ ఆఫ్ డ్రాగాన్’ చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. ‘హౌస్ ఆఫ్ డ్రాగాన్’.. టార్గారియన్‌లోని అంతర్యుద్ధం చుట్టూ ఈ కథ నడుస్తుంది. సుమారు 200 ఏళ్ల కిందట సింహాసనం కోసం జరిగిన యుద్ధాలను, వైట్ వాకర్స్ ఆవిర్భావం తదితర కీలక ఘట్టాలను ప్రీక్వెల్‌లో చూపించే అవకాశాలున్నాయి. ఈ సీజన్‌తోపాటే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ 9వ సీజన్ చిత్రీకరణ కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై HBO నుంచి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?