అన్వేషించండి

Fun Bucket Bhargav : నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఫన్ బకెట్ భార్గవ్ ఎమోషనల్ వీడియో!

కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో 'నాకు ఎవరూ సపోర్ట్ లేదు.. మీ సపోర్ట్ కావాలి' అంటూ భార్గవ్ పెట్టిన పోస్ట్ లు దుమారం రేపుతున్నాయి.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి.. గర్భవతిని చేశాడనే ఆరోపణలతో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఇతడికి సంబంధించిన వీడియోలు సంచలనంగా మారాయి. బాధితురాలి తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో దిశ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ అయిన భార్గవ్.. రీసెంట్ గా బయటకొచ్చి తన పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 

కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో 'నాకు ఎవరూ సపోర్ట్ లేదు.. మీ సపోర్ట్ కావాలి' అంటూ భార్గవ్ పెట్టిన పోస్ట్ లు దుమారం రేపుతున్నాయి. భార్గవ్ బయటకొచ్చాడని తెలిసి అతడిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా మరోసారి అతడి పెట్టిన వీడియోపై మండిపడుతున్నారు. 'ఇదీ నా కథ' అనే పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు భార్గవ్. దాదాపు ఇరవై నిమిషాల పాటు మాట్లాడుతూ చాలా విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేశారు. 

,చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ ముందుండే వాడినని కానీ కొన్ని కారణంగా చదువుకి దూరమయ్యానని చెప్పారు. ఆ తరువాత మెల్లగా వీడియోలు చేస్తూ తన టాలెంట్ నిరూపించుకున్నానని.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నెలకు 8 లక్షల రూపాయలు సంపాదించేవాడినని.. కానీ డబ్బు వెనకేసుకోలేకపోయానని.. ఇప్పుడు జాబ్స్ అన్నీ పోయాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద నడుస్తున్న ప్రచారం అంతా నిజం కాదని.. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇంతకుమించి ఏం చెప్పలేనని అన్నారు. 

తన మీద కేసు నమోదై జైలుకి వెళ్లాక నమ్మిన వాళ్లే మోసం చేశారని వాపోయారు భార్గవ్. తన పాస్ వర్డ్ ఎలాగోలా సేకరించి తన అకౌంట్ నుండి రూ.12 లక్షలు డ్రా చేశారని.. అయినా కూడా క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చారు. వీలైతే తనను క్షమించమని.. నెగెటివ్ కామెంట్స్ చేయకండి అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తన పక్కన ఎవరూ లేరని ఇప్పుడు తిరిగి మళ్లీ మొదటినుండి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నానని.. మీ సపోర్ట్ కావాలని కోరారు. 

అయితే ఈ మొత్తం వ్యవహారంలో తనపై నమోదైన కేసు గురించి మాత్రం భార్గవ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన వివరణ హానెస్ట్ గా లేదని.. సెంటిమెంట్ తో మళ్లీ రావాలని చూస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget