Shilpa shetty: పదిహేనేళ్ల నాటి ముద్దు కేసు... బాధితురాలిగా బయటపడిన శిల్పాశెట్టి
పదిహేనేళ్ల క్రితంనాటి ముద్దు కేసు నుంచి శిల్పా శెట్టి బయటపడింది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పదిహేనేళ్లుగా వెంటాడుతున్న ఓ ముద్దు కేసు నుంచి బయటపడింది. ఆమెపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అందులో ఆమె నిందితురాలు కాదని, బాధితురాలని తేల్చింది. దీంతో శిల్పాశెట్టి పెద్ద ఊరట లభించినట్టయింది. అసలే గత ఏడాది భర్త జైలుకు వెళ్లడం, తరువాత తల్లిపై కేసు నమోదవ్వడం వంటి సంఘటనలతో చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యింది శిల్పా. ఇలాంటి సమయంలో ఆమెపై పెట్టిన పాత కేసు విచారణకు వచ్చింది. అందులో ఆమె తప్పేమీ లేదని కోర్టు కొట్టివేయడంతో శిల్పా చాలా సంతోషపడింది.
ఏమిటా కేసు?
2007, ఏప్రిల్ 15న రాజస్థాన్ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేక అతిథులుగా శిల్పాశెట్టి, హాలీవుడ్ హీరో రిచర్డ్ గెరె కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో అందరూ చూస్తుండగా వేదికపై శిల్పాశెట్టిని రిచర్డ్ గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అది చూసి అక్కడున్న వారే కాదు, టీవీల్లో, పత్రికల్లో చూసిన వారు కూడా ఆశ్చర్యపోయారు. రిచర్డ్ గెరె బలవంతంగా ముద్దు పెడుతున్నప్పుడు, ఆమె ప్రతిఘటించలేదని శిల్పా ప్రధాన ఆరోపణ. బహిరంగంగా అలా ప్రవర్తించడం తప్పని వారణాసి, కాన్పూర్, దిల్లీ, ముంబై నగరాలతో సహా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో వారిద్దరి మధ్య కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 294 కింద కేసులు పెట్టారు. అయితే సెలెబ్రిటీలిద్దరూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వారిద్దరి అరెస్ట్ వారెంట్లను రద్దు చేసింది. అప్పట్నించి కేసు విచారణ సాగుతూనే ఉంది. కేసు రాజస్థాన్లో నమోదు కాదా శిల్పా ముంబై కోర్టుకు బదిలీ చేయించుకుంది.
ఆమె బాధితురాలు...
ఇటీవల మళ్లీ ఈ కేసు ముంబై కోర్టులో విచారణకు వచ్చింది. అయితే న్యాయమూర్తి ఈ కేసును కొట్టి వేస్తూ ఆ సంఘటనలో శిల్పాశెట్టి నిందితురాలు కాదని, బాధితురాలని తేల్చి చెప్పారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదులన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆ ఘటన జరిగిన వెంటనే శిల్పాశెట్టి అక్కడ్నించి వెళ్లిపోయారని అన్నారు. కాబట్టి ఆమె తప్పు ఏమీ లేదని తేల్చింది కేసును కొట్టి వేస్తున్నట్టు చెప్పారు. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెను నిందితుడిగా పేర్కొంది కోర్టు. కానీ రిచర్డ్ అప్పట్లోనే క్షమాపణ చెప్పాడు.
View this post on Instagram
Also Read: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?