Urvashi Rautela: ఊర్వశి గోల్డెన్ ఫోన్ దొరికింది, ఇవ్వాలంటే ఆ కండీషన్కు ఒప్పుకోవాలట!
తాజాగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో అందాల తార ఊర్వశి రౌతేలా తన ఫోన్ పోగొట్టుకుంది. ఆ ఫోన్ తన దగ్గర ఉందన్న ఓ అభిమాని, తిరిగి ఇచ్చేందుకు ఓ కండీషన్ పెట్టాడు.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు క్రికెట్ అంటే చెప్పలేనంత పిచ్చి. భారత్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, క్రికెట్ ను మాత్రం మిస్ చేయదు. తాజాగా ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఊర్వశి, అభిమానులతో కలిసి సందడి చేసింది. భారత జట్టును ఉత్సాహపరిచింది. సంతోషంలో పడిపోయి ఊర్వశి తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. మ్యాచ్ అయ్యాక తన ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫోన్ పోగొట్టుకున్నట్లు చెప్పింది.
ఫోన్ ఇస్తే మంచి బహుమతి ఇస్తా!
ఎవరికైనా తన ఫోన్ దొరికితే ఇవ్వాలని ఊర్వశి విజ్ఞప్తి చేసింది. "అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నా 24 క్యారెట్ల బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్నాను! ఎవరైనా దానిని చూసినట్లయితే, దయచేసి నాకు అందేలా చూడండి. ఫోన్ దొరికిన వాళ్లు వెంటనే నన్ను సంప్రదించండి” అని రాసుకొచ్చింది. అటు తన ఫోన్ ను వెతికి పెట్టాలని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పనిలో పనిగా తన ఫోన్ తిరిగి ఇచ్చిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించింది.
View this post on Instagram
ఫోన్ ఇవ్వాలంటే కండీషన్ కు ఒప్పుకోవాలి!
ఎట్టకేలకు ఊర్వశి ప్రయత్నం ఫలించింది. ఆమె ట్వీట్ కు ఓ అజ్ఞాత అభిమాని స్పందించాడు. ఫోన్ తన దగ్గరే ఉందని ఓ ఈమెయిల్ పంపించాడు. అయితే, ఫోన్ ను ఇవ్వాలంటే తన కండీషన్ కు ఒప్పుకోవాలని చెప్పాడు. “మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే నాదో కండీషన్ ఉంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి” అని మెయిల్ లో చెప్పాడు. ఈ కండీషన్ కు ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్ అప్ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్ తెచ్చి ఇస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఐటెమ్ బ్యూటీగా మంచి గుర్తింపు
ఇక ఊర్వశి రౌతేలా ప్రస్తుతం వరుస సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ సినీ అభిమానులను అలరిస్తోంది. ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో కుర్రకారును పిచ్చెక్కించింది. తాజాగా ‘బ్రో’ చిత్రంలో ‘ఎంటర్‌టైన్‌మెంట్‌కు గ్యారెంటీ ఇస్తా’ ఆకట్టుకుంది. ‘ఏజెంట్’ లోనూ స్పెషల్ సాంగ్ తో అలరించింది. అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నది. ‘దిల్ హై గ్రే’, ‘బ్లాక్ రోజ్’లో స్పెషల్ సాంగ్స్ చేసింది. జోసెఫ్ డి సామి తాజా ప్రాజెక్టులోనూ ఐటెమ్ సాంగ్ చేయబోతోంది. 2015లో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది ఊర్వశి.
Read Also: ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial