Samyuktha Menon: 'భీమ్లానాయక్' బ్యూటీ పేరుతో ఫేక్ అకౌంట్, ఫ్యాన్స్ ను అలర్ట్ చేసిన సంయుక్త మీనన్
సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. సంయుక్త పేరుతో ఉన్న అకౌంట్ కి అయితే డెబ్భై వేలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ 'భీమ్లానాయక్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. సినిమా రిలీజైన తరువాత భారీ హిట్ అందుకోవడంతో సంయుక్తకు కూడా కలిసొచ్చింది. క్లైమాక్స్ లో ఆమె పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
దీంతో తెలుగులో ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ సరసన 'సార్' అనే సినిమాలో నటిస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంయుక్త మీనన్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. దీంతో కొందరు ఆమె పేరుతో ఓ ఫేక్ అకౌంట్ ని మొదలుపెట్టారు.
సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. సంయుక్త పేరుతో ఉన్న అకౌంట్ కి అయితే డెబ్భై వేలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది గమనించిన ఈ బ్యూటీ వెంటనే ఫ్యాన్స్ ను అలర్ట్ చేసింది. అది తన అకౌంట్ కాదని.. ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. సంయుక్త ఒరిజినల్ అకౌంట్ కంటే ఫేక్ అకౌంట్ ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Check the story on my official Instagram page . https://t.co/jNn11Gu2gB pic.twitter.com/INpsT5kREU
— Samyuktha (@iamsamyuktha_) March 1, 2022
View this post on Instagram