![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Fahadh Faasil: మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకుంటేనే ఓటీటీ వాళ్లు తీసుకుంటారు, మిగతా భాషల్లా కాదు - మలయాళం సినిమాలపై ఫాహద్ కామెంట్స్
Fahadh Faasil : మలయాళంలో OTT మోడల్ ఇతర పరిశ్రమల కంటే భిన్నం అని ఫాహద్ ఫాసిల్ అన్నారు. మిగతా పరిశ్రమల సినిమాల్లా కాదని, మలయాళం సినిమా డిఫరెంట్ అని అన్నారు ఫాహద్ ఫాసిల్.
![Fahadh Faasil: మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకుంటేనే ఓటీటీ వాళ్లు తీసుకుంటారు, మిగతా భాషల్లా కాదు - మలయాళం సినిమాలపై ఫాహద్ కామెంట్స్ Fahadh Faasil explains how OTT model in Malayalam is distinct from other industries Fahadh Faasil: మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకుంటేనే ఓటీటీ వాళ్లు తీసుకుంటారు, మిగతా భాషల్లా కాదు - మలయాళం సినిమాలపై ఫాహద్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/fb5305cc3d37a077af934d36f1b6afb01714028017452932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fahadh Faasil explains how OTT model In Malayalam: మలయాళం సినిమాలు చాలా సింపుల్ గా, మంచి కథతో డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా లవర్స్ కి మలయాళం సినిమాలు చాలా ఇష్టం. ఇక ఓటీటీలు వచ్చాక మలయాళం సినిమాలకి ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. అయితే, మలయాళం సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవ్వడంలో మాత్రం వ్యత్యాసం ఉందట. ఓటీటీ రిలీజ్ విషయంలో మలయాళం సినిమా భిన్నం అని అన్నారు ఫాహద్.
మమల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి..
ఫాహద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' సినిమా ఇటీవల రిలీజైంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర కూడా బంపర్ హిట్ అయ్యింది. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే, ఈ సినిమా సక్సెస్ లో భాగంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు ఫాహద్. మలయాళం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే రిలీజై, సక్సెస్ అయితేనే ఓటీటీల్లో రిలీజ్ చేసుకుంటారని అన్నారు.
“మాలీవుడ్ సినిమాలకి ట్రేడ్ బాగా పెరిగింది. కానీ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు మాత్రం మా సినిమాలకి సాలిడ్ బ్యాకప్ లేదు. మమ్మల్ని మేము థియేటర్లలో నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే.. మా సినిమాలు తీసుకునేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వాళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన దేశంలోని మిగతా భాషల సినిమాలు మాత్రం 80 శాతం షూటింగ్ పూర్తైన వెంటనే ఓటీటీలకు అమ్ముడవుతాయి. కానీ, మా సినిమాలు మాత్రం డిఫరెంట్. మా సినిమా పూర్తవ్వాలి, రిలీజ్ అవ్వాలి. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లను అట్రాక్ట్ చేయాలంటే.. మా సినిమాలు పూర్తి చేసి, వాటి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఈ విధానం మన సినిమా సంస్క్రృతిని ప్రభావితం చేసింది. ఈ విధానం మాపై బాధ్యతను పెంచింది. ఆకట్టుకునే కథలను సృష్టించాలని, నాణ్యమైన కంటెంట్ వచ్చేలా కృషి చేయాలనే పట్టుదలను పెంచింది" అని అన్నారు ఫాహద్ ఫాసిల్.
ఓటీటీ టాప్‌లో మలయాళం సినిమాలు
మలయాళం సినిమాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓటీటీల్లో ఎక్కువగా ఆ సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు సినిమా లవర్స్. ఆ సినిమాల కథ నేచురల్ గా ఉంటుందని, యాక్టింగ్ కూడా నేచురల్ గా సింపుల్ గా ఉంటాయి. ఇక లాక్ డౌన్ టైంలో మలయాళం సినిమాలు తెగ చూశారు ప్రేక్షకులు.
పాన్ ఇండియా స్టార్..
షాహద్ ఫాసిల్.. మలయాళంలో అగ్ర నటుడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితమే. అంతేకాదు ఆయన నటించిన మలయాళం సినిమాలను ఓటీటీల్లో చూసి ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు ఎంతోమంది. ఇక 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు మరింత దగ్గరయ్యారు ఫాహద్. ఈ చిత్రంలో ఫాహద్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌లో కనిపించింది కొద్ది సేపు అయినా బన్వర్ సింగ్ షికావత్‌గా 'పుష్పరాజ్'ను డామినేట్ చేశాడు. కొన్ని క్షణాల పాటు పుష్పరాజ్‌కు చుక్కలు చూపించాడు. దీంతో సెకండ్ పార్ట్‌లో బన్వర్ సింగ్ రోల్‌పై అందరి ఆసక్తి నెలకొంది.
కాంట్రవర్సీ కామెంట్స్..
ఇక ఇటీవల ఆయన నటించిన 'ఆవేశం' సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దాంట్లో ఫాహద్ నటన వేరేలెవెల్ అంటూ రివ్యూలు ఇచ్చారు అందరూ. స్టోరీ లైన్, ఫాహల్ యాక్టింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి అంటూ కామెంట్లు పెట్టారు చాలామంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఆయన సినిమాలపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దుమారం రేపాయి. సినిమా లవర్స్ ఫాహద్ కామెంట్స్ ను తప్పు పడుతున్నారు. అలా అనడం ఏంటి బ్రో అంటున్నారు.
Also Read: దుమారం రేపుతున్న ‘పుష్ప’ విలన్ ఫాహద్ ఫాసిల్ కామెంట్స్ - మూవీ లవర్స్ జీర్ణించుకోవడం కష్టమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)