Fahadh Faasil: దుమారం రేపుతున్న ‘పుష్ప’ విలన్ ఫాహద్ ఫాసిల్ కామెంట్స్ - మూవీ లవర్స్ జీర్ణించుకోవడం కష్టమే!
Fahadh Faasil: 'పుష్ప 2' స్టార్ ఫహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సినిమాలు చూడటంపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Pushpa 2 Star Fahadh Faasil Sparks Controversy: ఫాహద్ ఫాసిల్.. తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వరుస, వెరైటీ సినిమాలు, క్యారెక్టర్లతో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు ఫాహద్ ఫాసిల్. అయితే, ఇప్పుడు ఆయన సినిమాల చూసే విషయంపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సినిమా లవర్స్ ని హర్ట్ చేసినట్టున్నాయి ఆ కామెంట్స్. ఆయన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు.
అసలు ఏమన్నారంటే?
ఈ మధ్యలో ఫాహద్ ఫాసిల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమాలపై కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేదే ముఖ్యం కాదు.. ఇంకా జీవితంలో చాలా ఉన్నాయి అని అన్నారు. "సినిమా అప్రోచ్ మారాలని నేను అనుకుంటున్నాను. ఇంట్లో డైనింగ్ టేబుల్ వరకు సినిమా గురించి డిస్కషన్ తీసుకువెళ్లకూడదు. అని నా అభిప్రాయం. థియేటర్ లో లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వరకు మాత్రమే.. మాట్లాడుకోవాలి. అంతే చాలు. సినిమా ఏమి అంతకు మించి కాదు. సినిమా కూడా లిమిట్స్ ఉన్నాయి. సినిమా కాకుండా జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి" అంటూ కామెంట్ చేశారు.
దీంతో ఆయన కామెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయనపై మండిపడుతున్నారు చాలామంది."సో మా జీవితం మేం చూసుకోవాలి అని చెప్తున్నారా? ఫాఫా" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. "సినీఫైల్స్ కి పనిలేదు అని అంటున్నాడు" అని ఒక నెటిజన్ మండిపడ్డాడు. "ఈ బిహేవియర్ ఏంటి ఫాఫా" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ, ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. సినిమాలు, ఫ్యాన్స్ అంటూ చాలామంది యువత తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారంటూ ఫాహద్‌కు సపోర్ట్ చేస్తున్నారు.
పుష్పతో పాన్ ఇండియా లెవెల్..
మలయాళం అగ్ర నటుడైన ఫాహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు డబ్బింగ్ చిత్రాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితమే. ఇక 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఫాహద్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌లో కనిపించింది కొద్ది సేపు అయినా బన్వర్ సింగ్ షికావత్‌గా 'పుష్పరాజ్'ను డామినేట్ చేశాడు. కొన్ని క్షణాల పాటు పుష్పరాజ్‌కు చుక్కలు చూపించాడు. దీంతో సెకండ్ పార్ట్‌లో బన్వర్ సింగ్ రోల్‌పై అందరి ఆసక్తి నెలకొంది. పుష్పరాజ్‌కు బన్వర్ సింగ్‌కు మధ్య హోరాహోరి పోరు ఉండనుందని అర్థమైపోయినా, ఆయన క్యారెక్టర్ రైషన్ ఎలా ఉండబోంతుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది. 'పుష్ప - 2'లో అల్లు అర్జున్ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఫాహద్ గురించి అంతే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఇటీవల ఆయన నటించిన 'ఆవేశం' సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దాంట్లో ఫాహద్ నటన వేరేలెవెల్ అంటూ రివ్యూలు ఇచ్చారు అందరూ. స్టోరీ లైన్, ఫాహల్ యాక్టింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి అంటూ కామెంట్లు పెట్టారు చాలామంది.