Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!
ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు నవ్వుల్లో ముంచెత్తే ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ఈ వారం మరింత కామెడీని పంచబోతోంది. అక్టోబర్ 6న ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే కామెడీ షో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’. ఈ షోలో కమెడియన్లు చేసే ఫన్ అందరినీ పగలబడి నవ్వేలా చేస్తుంది. శుక్రవారం వచ్చిందంటే చాలు ఈ షో కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు. గత 10 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఈ షో అలరిస్తోంది. ఎప్పటి లాగే ఈ వారం కూడా మరింత ఫన్ తో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
కామెడీతో చంపేసిన ఫైమా
ప్రోమో షురూ కాగానే లేడీ కమెడియన్ ఫైమా పల్లకిలో స్టేజి మీదకు వస్తుంది. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. స్టేజి మీద మరో లేడీ కెడియన్ సత్యశ్రీతో కలిసి స్టెప్పులు వేస్తుంది. ఆమెను పెళ్లి చూపులు చూసేందుకు బుల్లెట్ భాస్కర్ వస్తారు. అమ్మాయి ఎలా ఉంది? అనగానే.. కుందనపు బొమ్మలా ఉంది. అందాన్ని రోజూ కొరుక్కుని కొరుక్కుని తింటా అంటాడు. కానీ, తాళికట్టే సమయంలో అతడు చెప్పిన మాటలు ఫైమా గురించి కాదు, సత్యశ్రీ గురించి అని తెలిసి అందరూ షాక్ అవుతారు. తనను పెళ్లి చేసుకోవడానికి వచ్చే సత్యను పెళ్లి చేసుకున్నాడంటూ మరో కమెడియన్ నాటీ నరేష్ కు చెప్తుంది. ఎవడీడు అని భాస్కర్ అడగగానే, నా లవర్, 10 ఏండ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం అంటుంది. వాడికే 10 ఏండ్లు లేవు. వాడిని 10 నుంచి ప్రేమిస్తున్నావా? అనగానే అందరూ నవ్వుతారు.
వర్ష, ఇమ్మాన్యుయేల్ ఫన్ మరో లెవల్
ఇక వర్ష, ఇమ్మాన్యుయేల్ ఫన్ మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. పని మనిషిగా వర్ష, యజమానిగా ఇమ్మాన్యుయేల్ పండించిన సరసం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఇమ్మూ ఈ మధ్య మరీ ఓవర్ అయిపోతున్నావ్ అంటుంది వర్ష. వయసులో ఉన్నాం అవక ఏం చేస్తాం చెప్పు అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. నలుగురిలో ఇలా కొడితే నా మీద మచ్చ పడుతుంది అంటుంది వర్ష. పని మనిషివే కదా తుడిచేసుకోవచ్చులే అనడంతో అందరూ పడీ పడీ నవ్వుతారు.
‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ స్టేజి మీద ‘మ్యాడ్’ టీమ్ సందడి
ఇక ఈ వారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ స్టేజి మీద ‘మ్యాడ్’ మూవీ టీమ్ ఫుల్ సందడి చేసింది. ఆటో రామ్ ప్రసాద్ వారితో కలిసి చేసిన ఫన్ అలరించింది. సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య తేడా ఏంటో తెలుసా అనగానే, మాకన్నా మీకు ఎక్కువ బ్యాక్ లాక్స్ ఉంటాయని చెప్పడంతో అందరూ నవ్వుతారు. మీకు ఆటలు వచ్చా అనడంతో కబడ్డీలో ఇప్పటి వరకు ఓడిపోలేదు అంటారు. అంత బాగా ఆడుతారా? అనడంతో అస్సలు అడలేదు అంటారు. మరి ఇప్పటి వరకు ఓడిపోలేదు అన్నారు అనడంతో, ఆడలేదు కాబట్టే ఓడిపోలేని చెప్పడంతో షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ‘మ్యాడ్’ ఈ షోలో చేసిన ఫన్ అందరినీ ఆకట్టుకుంది. అక్టోబర్ 6న ఈ ఎపిసోడ్ పూర్తిగా ప్రసారం కానుంది.
Read Also: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial