అన్వేషించండి

ETV Prabhakar Son : హీరోగా రెండు ఛాన్సులు తెచ్చిన 'నాటు నాటు' కవర్ సాంగ్

తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వస్తున్నాడు. 'ఈటీవీ' ప్రభాకర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

'ఆర్ఆర్ఆర్' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో భారతీయ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆ సినిమాలో పాటలకు చాలా మంది కవర్ సాంగ్స్ చేశారు. అందులో చంద్రహాస్ (Chandrahas) ఒకరు. 'నాటు నాటు...' పాటకు ఆయన కవర్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ హీరోగా రెండు ఛాన్సులు తీసుకొచ్చిందని చంద్రహాస్ తండ్రి, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ (ETV Prabhakar) తెలిపారు.

వారసులా? కొత్త వాళ్ళా? అని చూడకుండా ప్రతిభావంతులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పట్టం కడుతుంది. తన ప్రతిభను చూపించడానికి 'ఈటీవీ' ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ వస్తున్నారు. శనివారం (సెప్టెంబర్ 17న) ఆయన పుట్టినరోజు (Chandrahas Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా పోస్టర్లను తల్లి, ప్రభాకర్‌ భార్య మలయజ విడుదల చేశారు.
 
హీరో కావాలనేది చంద్రహాస్ కోరిక...
నా ప్రమేయం ఏమీ లేదు! - ప్రభాకర్
తనయుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న సందర్భంగా 'ఈటీవీ' ప్రభాకర్ మాట్లాడుతూ ''నేను ఇండ్రస్టీకి వచ్చి పాతికేళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకున్నాడు. నటనను వృత్తిగా ఎంచుకుని హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రిగా వాడి ఇష్టాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే. నా ప్రమేయం అసలు లేదు. చాలా రోజుల నుంచి హీరో అవుతానంటే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను. అయినా సరే... పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువుతూ... మరోవైపు ఫైట్స్‌, డాన్స్‌, యాక్టింగ్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. ఒకరోజు కవర్ సాంగ్స్ చేయడానికి డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాను. 'నాటు నాటు' సాంగ్ చేశాడు. అది చూసి దర్శక నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు'' అని చెప్పారు. 

హీరోగా చంద్రహాస్ చేస్తున్న సినిమాలు...
కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాణంలో హీరోగా చంద్రహాస్ ఒక సినిమా చేస్తున్నాడు. దానికి కృష్ణ దర్శకుడు. ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై ఏవీఆర్‌, నరేష్‌ నిర్మాణంలో సంపత్‌ వి. రుద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చంద్రహాస్. 'ఈటీవీ' ప్రభాకర్ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రానికి కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌ సహ నిర్మాతలు. 

Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

చంద్రహాస్ హీరో అవుతుండటం సంతోషంగా ఉందని అతని తల్లి, 'ఈటీవీ' ప్రభాకర్ భార్య మలయజ తెలిపారు. ''ఊహ తెలిసినప్పటి నుంచి టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌, సినిమా ప్రముఖులు... షూటింగ్‌ల వాతావరణంలో పెరిగాను. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. మా నాన్నగారి కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూశా. అయినప్పటికీ ఆయన మంచి ప్రవర్తనతో అందరూ ఇష్టపడే స్థాయికి వచ్చారు. నేను నాన్నగారిలా  అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. నా నుంచి ఎలాంటి లోపం లేకుండా కృషి చేస్తాను. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాను'' అని చంద్రహాస్ తెలిపారు. 

Also Read : 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget