అన్వేషించండి
Advertisement
ET Teaser: 'మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు' సూర్య కాన్ఫిడెన్స్ చూశారా?
సూర్య 'ఈటీ'(ఎతరుక్కుమ్ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.
కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు సూర్య. ఆయన తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు సూర్య. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రెండు సినిమాలు 'ఆకాశం నీ హద్దురా', 'జైభీమ్' సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సూర్య 'ఈటీ'(ఎతరుక్కుమ్ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు.
పాండిరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మార్చి 10న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మొత్తం యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ను నింపేశారు. హీరోయిన్, విలన్ లను టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. డైలాగ్స్ లేకుండా టీజర్ ను కట్ చేశారు. చివర్లో మాత్రం సూర్య.. 'నాతో ఉన్నవాళ్లు ఎప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు' అంటూ చాలా కాన్ఫిడెంట్ ఓ డైలాగ్ చెప్పారు.

ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. డి ఇమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
క్రైమ్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion