Entertainment Top Stories Today: ‘దేవర’ ఆరు రోజుల కలెక్షన్స్, ముదురుతున్న కొండా సురేఖ వివాదం - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘దేవర’ ఆరు రోజుల కలెక్షన్స్ నుంచి ముదురుతున్న కొండా సురేఖ వివాదం వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
‘దేవర’ మొదటి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఒక షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన ప్రియాంక అరుల్ మోహన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాని సహా చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించారు. ‘ఇండియన్ 3’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వస్తున్న రూమర్స్‌పై చిత్రబృందం స్పందించింది.
ఆరు రోజుల్లో రూ.396 కోట్లు వసూలు చేసిన ‘దేవర’
మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతుంది. మొదటి ఆరు రోజుల్లో ఏకంగా రూ.396 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ బ్రేక్ఈవెన్ చేసుకున్న ‘దేవర’ ప్రొడ్యూసర్లకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు స్వల్ప గాయాలు...
తెలుగు ప్రేక్షకులు మెచ్చిన తమిళ అందాల భామలలో యంగ్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆవిడకు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ వల్ల షాప్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు పిలుస్తారు. గురువారం అలా ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రియాంకకు షాక్ తగిలింది. గాయాల పాలు అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలతో పాటు సినిమా పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై రాజకీయ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంలోకి అక్కినేని ఫ్యామిలీని లాగారు. హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడాకులకు కారణంగా కేటీఆర్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ డిమాండ్లకు నాగార్జున, నాగ చైతన్య లొంగిపోయారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. దిగజారుడు రాజకీయాలకు ఈ వ్యాఖ్యలు పరాకాష్ట అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని ఫైర్ అయ్యారు. కొండా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరారు. అయితే... సమంతకు కొండా సురేఖ సారీ చెప్పడం అంతా స్టుపిడిటీ మరొకటి లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఆడియో నోట్ విడుదల చేశారు. సారీ చెప్పాల్సింది సమంతకు కాదని... నాగ చైతన్య, నాగార్జునకు అని ఆయన పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పుకార్లకు చెక్ పెట్టిన 'ఇండియన్ 3' టీమ్
లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు' (తమిళంలో 'ఇండియన్ 2')కు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఆ సినిమా ఎంతో మందికి ఫేవరెట్. అందుకనే 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... 'ఇండియన్ 2' ఆశించిన రీతిలో ఆడలేదు. థియేటర్లలోనూ, డిజిటల్ వేదికలోనూ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. దాంతో 'ఇండియన్ 3' విడుదల మీద ఊహాగానాలు మొదలు అయ్యాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)