Konda Surekha: దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట... కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని తీవ్ర ఆగ్రహం
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ నటులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె మాటలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ మండిపడుతున్నారు.
Actors Angry On Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలతో పాటు సినిమా పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై రాజకీయ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంలోకి అక్కినేని ఫ్యామిలీని లాగారు. హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడాకులకు కారణంగా కేటీఆర్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ డిమాండ్లకు నాగార్జున, నాగ చైతన్య లొంగిపోయారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. దిగజారుడు రాజకీయాలకు ఈ వ్యాఖ్యలు పరాకాష్ట అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని ఫైర్ అయ్యారు. కొండా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం- ఎన్టీఆర్
కొండా సురేఖ వ్యాఖ్యలను ఎన్టీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. “కొండా సురేఖ వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రజా జీవితంలో ఉన్న ఆమె గౌరవంగా ప్రవర్తించాలి. సినీ పరిశ్రమలోని ప్రముఖులపై నిరాధార వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఎవరికి వాళ్లు ఇండస్ట్రీ వ్యక్తులపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. హద్దులు దాటి ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. నిర్లక్ష్య పూరిత ప్రవర్తన రాజకీయ జీవిత సమాధికి కారణం అవుతుంది” అని ఎన్టీఆర్ హెచ్చరించారు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024
ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా?
రాజకీయ నాయకుల దిగజారిన మాటలు వింటుంటే అసహ్యం వేస్తోందని నటుడు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజకీయ నాయకుల అడ్డగోలు వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యంగా ఉంది. కనీసం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే కనీసం ప్రజల పట్ల బాధ్యత ఉందా? అనే అనుమానం కలుగుతుంది. బాధ్యతాయుత పదవులలో ఉన్న వాళ్లు నిరాధార ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సొసైటీపై తీవర ప్రభావం చూపించే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని నాని అన్నారు.
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024
పదవి, అధికారంతో గౌరవాన్ని కొనలేరు- శ్రీకాంత్ ఓదెల
నటి సమంత గురించి మాట్లాడే కనీస అర్హత మంత్రి కొండా సురేఖకు లేదని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారు. “రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. సమంతను దగ్గరగా చూసిన వ్యక్తిగా, అభిమానిగా చెప్తున్నాను. ఆమె ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. మంత్రి సురేఖకు ఆమె గురించి మాట్లాడే అర్హత లేదు. గౌరప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడ్డం దారుణం. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరనే విషయాన్ని గుర్తించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధగా ఉంది” అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.
So bloody unfortunate to hear such disgusting comments especially from a person in a respectable position. This shows that power and position can't buy you dignity.
— Srikanth Odela (@odela_srikanth) October 2, 2024
రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక అభిమాని గ…
చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నిజంగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని దర్శకుడు వేణు ఉడుగుల అన్నారు. “అధికారం ఒక బాధ్యత. చౌకబారు వ్యూహాలకు వేదిక కాదు. మంత్రి కొండా సురేఖ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడింది. సంబంధం లేని వ్యక్తులను వివాదంలోకి లాగింది. ఆమె వాదనలు నిజమైతే కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే సరిపోయేది. న్యాయానికి జవాబుదారీతనం కావాలి, డ్రామా కాదు. ఇప్పటికైనా కొండా సురేఖ తన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడాలి” అని వేణు అన్నారు.
Power is a responsibility, not a stage for cheap tactics. Minister #KondaSurekha’s reckless remarks have pulled unrelated individuals into controversy. If her claims were true, why not take legal action against @KTRBRS? Justice requires accountability, not drama. Shame on you. pic.twitter.com/O9JRuUBhOP
— v e n u u d u g u l a (@venuudugulafilm) October 2, 2024
Read Also: మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య