అన్వేషించండి

Naga Chaitanya: మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య

Naga Chaitanya Reaction on Konda Surekha: తమ పర్సనల్ విషయాలను రాజకీయాల్లోకి లాగడం పట్ల నటుడు నాగ చైతన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాటలు పూర్తి అభ్యంతరకరం అంటూ సీరియస్ అయ్యారు.

Naga Chaitanya Serious On Konda Surekha: నటి సమంతతో విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు అక్కినేని నాగ చైతన్య తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలు తనతో పాటు తన కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయన్నారు. తమ విడాకుల గురించి గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికీ, కుటుంబంతో పాటు మాజీ భార్య మీద ఉన్న గౌరవం కారణంగా సైలెంట్ గా ఉన్నట్లు చెప్పారు. మంత్రి కొండా వ్యాఖ్యలు పూర్తి అబద్దం అంటూ మండిపడ్డారు. తమ రాజకీయ స్వార్థం కోసం సినీ నటులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణం అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు.   

కొండ వ్యాఖ్యలు క్షమించరానివి - నాగ చైతన్య

మంత్రి కొండా సురేఖ తమ విడాకుల గురించి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు నాగ చైతన్య. “కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆమె ప్రతి మాట వాస్తవానికి దూరంగా ఉంది. ఆమె వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఏ మాత్రం సహించలేం. మహిళగా ఉండి తోటి మహిళకు అండగా నిలబడాలి. అంతే కానీ, వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ మీడియాలో హైలెట్ కావాలని భావించడం నిజంగా సిగ్గుచేటు” అంటూ మడిపడ్డారు.

తల్లి వ్యాఖ్యలకు అఖిల్ సపోర్టు

అటు తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని అమల తీవ్రంగా ఖండించారు. ఒక మంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దారుణం అన్నారు. రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ‘‘ఒక మహిళా మంత్రి  రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని టార్గెట్ చేసి మాట్లాడ్డం నిజంగా దారుణం. నా భర్త గురించి తప్పుడు మాటలు మాట్లాడం సిగ్గుచేటు. నాయకులు ఇంతలా దిగజారడం దారుణం. రాహుల్ గాంధీ గారు.. మీ నాయకులను కంట్రోల్లో ఉంచుకోండి. మహిళా మంత్రితో నా ఫ్యామిలీకి సారీ చెప్పిడంతో పాటు ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ ప్రజలను కాపాడండి” అంటూ ట్వీట్ చేసింది.  ఈ వ్యాఖ్యలను నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా ఖండించారు. తల్లి సోషల్ మీడియా పోస్టును షేర్ చేస్తూ, ఆమె వ్యాఖ్యలకు సపోర్టు చేశారు. “అమ్మా.. మీరు చెప్పిన ప్రతి మాటకు నేను సపోర్టు చేస్తాను. కొంత మంది దయ్యాలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిసార్లు సామాజిక విద్రోహులను డీల్ చేయక తప్పదు” అని రాసుకొచ్చారు.

అక్కినేని ఫ్యామిలీ న్యాయపోరాటం!

అటు ఇప్పటికే కొండా సురేఖ తన చేసిన వ్యాఖ్యలను నటి సమంత తీవ్రంగా ఖండించింది.  మంత్రి వ్యాఖ్యల విషయంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ఏకతాటి మీదికి వచ్చింది. తన కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబం న్యాయ పోరాటం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Read Also: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget