Devara: ఆరు రోజుల్లో రూ.396 కోట్లు - దుమ్మురేపుతున్న ‘దేవర’!
Devara Collections: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ మొదటి ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.396 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Devara 6 Days Collections: మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతుంది. మొదటి ఆరు రోజుల్లో ఏకంగా రూ.396 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ బ్రేక్ఈవెన్ చేసుకున్న ‘దేవర’ ప్రొడ్యూసర్లకు, బయ్యర్లకు భారీ లాభాలను అందించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర: పార్ట్ 1’ రూ.170 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.120 కోట్ల వరకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర: పార్ట్ 1’ హక్కులు రూ.115 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ‘దేవర’ రూ.ఐదు కోట్లు లాభం సంపాదించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అంతే కాకుండా చెప్పుకోదగ్గ మరో పెద్ద సినిమా కూడా లేదు కాబట్టి మరో రెండు వారాలు ఈ సినిమాకు ఫ్రీ రన్ లభించనుంది.
ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేయవచ్చు?
ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.500 కోట్ల వరకు వసూలు చేయవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ ఏరియాల్లో ‘దేవర: పార్ట్ 1’ మంచి హోల్డ్‌ను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఫుల్ రన్‌లో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Also Read: అటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!
హిందీలో కూడా మంచి హోల్డ్
‘దేవర: పార్ట్ 1’ హిందీలో మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి ఆరు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్, రూ.45 కోట్లకు పైగా నెట్‌ను దేవర వసూలు చేసింది. హిందీతో కూడా మరో రెండు వారాల పాటు సరైన సినిమా ఏదీ లేదు కాబట్టి అక్టోబర్ 11వ తేదీన ఆలియా భట్ ‘జిగ్రా’ వచ్చే దాకా ‘దేవర’ కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలుగులో విలన్‌గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’లో కూడా సైఫ్ నటించారు కానీ అది బాలీవుడ్ సినిమా. హిందీలో తీసి తెలుగులో డబ్ చేశారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు. ఇది ‘దేవర’ మొదటి భాగం మాత్రమే. త్వరలో ‘దేవర: పార్ట్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
It’s his Brutal Massacre…
— Devara (@DevaraMovie) October 3, 2024
Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo